నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేయడమే కాదు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో రష్మిక ప్రెజెంట్ ఫుల్ బిజీ. అయితే తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిన విజయ్ దేవరకొండ తో రష్మిక డేటింగ్ చేస్తుంది అనే రూమర్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.
ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్స్, వెకేషన్స్ అంటూ సరదాగా గడుపుతూ ఉంటారు. కానీ తాము రిలేషన్ లో లేమని, మేము మంచి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కలిసి వెకేషన్ కి వెళ్లకూడదా అంటూ విజయ్, రష్మిలు వాదించినా వారి మద్య అనుబంధం చూస్తే వీరు ఖచ్చితంగా డేటింగ్ లో ఉన్నారని అంటారు. తాజాగా రష్మిక ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైంది.
ఆ ఈవెంట్ లో ఆనంద్ రష్మిక పక్కనే కూర్చుని మీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు అని అడిగాడు. దానికి రష్మిక సిగ్గుపడుతూ ఆనంద్ చెవిలో ఏదో చెబుతూనే ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్ లో పెడితే ఎట్లా అని చెప్పిన రష్మిక తనకి ఇష్టమైన హీరో రౌడీ బాయ్ అంటూ చెప్పింది. మరి ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ అంటే మీనింగ్ రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నట్లేగా.. ఇప్పుడేం చెబుతారు అంటూ నెటిజెన్స్ క్వచ్చన్ చేస్తున్నారు.