జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగా.. సినిమాలకి దగ్గరగా ఉంటున్నారు. టీడీపీ తో కానీ ఏ పార్టీ తో కానీ సంబంధాలు లేని ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్స్ ఏవో తాను చేసుకుంటున్నారు. కానీ మధ్యలో టీడీపీ నేతలు, వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ కి అనవసరంగా రాజకీయరంగు పులమడానికి చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. టీడీపీ కార్యకర్తల్లో ఎన్టీఆర్ టీడీపీ లోకి రావాలనే బలమైన కోరిక ఉంది.
కానీ చంద్రబాబు ని కాదని ఎన్టీఆర్ ని తీసుకొచ్చే ప్రయత్నమైతే చెయ్యలేరు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో కలిసి టీడీపీ అంటే అభిమానం ఉన్నోళ్లు జూనియర్ ఎన్టీఆర్ కనిపించగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు.
ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ బర్త్ యానివర్సరీ. మరి ఎప్పటిలాగే జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నివాళులు అర్పించడానికి రాగానే జూనియర్ ఎన్టీఆర్ ని చూసిన అభిమానులు సీఎం సీఎం అంటూ కేకలు వెయ్యడం చూస్తే.. ఎన్టీఆర్ అంటే ఎందుకింత పిచ్చి, ఎందుకింత అభిమానం అనకుండా ఉండలేరు.
తారక్ ని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చూడగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ తాతగారికి నివాళులు అర్పించి కాసేపు మౌనం పాటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దానితో అభిమానులు రిలాక్స్ అయ్యారు.