మే 13 ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మోడీ నామినేషన్ కార్యకమానికి హాజరయ్యాక ఏమయ్యారో తెలియదు. చంద్రబాబు షిరిడికి వెళ్లి పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ వైఫ్ తో వెకేషన్ కి వెళ్లారంటున్నారు. చంద్రబాబు అమెరికా వెళ్లారు. టీడీపీ నేతలు కూడా ఎన్నికల తర్వాత పోలింగ్ రోజు గొడవలపై మాట్లాడారు కానీ.. అధికారం మాదే అని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు.
కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఈసారి కూడా అధికారం మాదే, జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు, జూన్ 9 నే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తేదీ, టైమ్, వేదిక పై వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంతేకాదు కొంతమంది మంత్రులు ఓడిపోతామని ముందే ఫిక్స్ అయినట్లుగా ఈసారి ఎన్నికలు సజావుగా సాగలేదు, పోలీస్ వ్యవస్థ సరిగ్గా పని చెయ్యలేదు అంటూ చేతులెత్తేస్తున్నారు.
అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సైలెంట్ గా ఉండడం వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగేలా చేస్తుంది. జగన్ లండన్ కి వెళ్లినా.. ఇక్కడ వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడమే కాదు, టీడీపీ నేతలు కూడా మౌనం వహించడమే వైసీపీ నేతలకి మింగుడు పడడం లేదు. మరొక్క వారం రోజులు ఆగితే ఎవరు సీఎం అవుతారో అనే విషయం తేలిపోతుంది.