ఆంధ్ర - తెలంగాణాలో గత రెండుమూడు నెలలుగా ఎలక్షన్ ఫీవర్ నడిచింది. ఎన్నికలనగానే సినిమా మేకర్స్ గప్ చుప్ అయ్యారు సినిమాలు విడుదల చేస్తే ఎన్నికల హీట్ లో ఆడవేమో అని.. ఏ ఒక్కరూ సినిమాలు విడుదల చేసేందుకు ముందుకు రాలేదు. వేసవి సెలవలన్నీ కరిగిపోయాయి. చూస్తుండగా వేసవి ఫినిష్ అయ్యింది. ఎన్నికలు ముగిసాయి, తెలంగాణాలో థియేటర్స్ మూతపడ్డాయి.
ఇక ఒకొక్కరిగా సినిమాలు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో మే 31 శుక్రవారం చాలా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అందులో కాజల్ సత్యభామ, సుధీర్ బాబు హరోం హర వాయిదా పడి జూన్ 7 కి వెళ్లగా.. మే 31 న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయువేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేష్ చిత్రాలు పోటీపడుతున్నాయి.
ఆ మూడు సినిమాల్లో అంతో ఇంతో క్రేజ్ ఉన్న హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినే. రీసెంట్ గా గామి తో సక్సెస్ చూసిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితోను హిట్ కొట్టేలాగే కనబడుతున్నాడు. ఆ చిత్ర ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ అన్ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై అంచనాలు పెంచుతున్నాయి. కార్తికేయ సరైన సక్సెస్ లేక వరసగా నిరాశపరిచే సినిమాలతో ప్రేక్షకులని డిజ్ పాయింట్ చేసాడు. ఇప్పుడు భజే వాయువేగంతో దూసుకొస్తున్నా.. ఆ చిత్రంపై ఎందుకో బజ్ క్రియేట్ అవ్వట్లేదు.
ఇక బేబీ లాంటి హిట్ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న ఆనంద్ దేవరకొండ పై చిన్న హీరో అనే ముద్ర ఉంది. ఆనంద్ దేవరకొండ గం గం గణేశ పై ఎలాంటి హైప్ లేదు. బేబీ సక్సెస్ గం గం గణేశకి ఏమాత్రం హెల్ప్ అయ్యేలా లేదు. ఇప్పుడు అందరి చూపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపైనే ఉంది. మరి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయం.