Advertisementt

ధమాకా కాంబో రిపీట్

Mon 27th May 2024 05:33 PM
dhamaka  ధమాకా కాంబో రిపీట్
Dhamaka Combination to Repeat ధమాకా కాంబో రిపీట్
Advertisement
Ads by CJ

ధమాకా కాంబో రిపీట్ అంటూ సోషల్ మీడియాలో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ధమాకా కాంబో అంటే రవితేజ-శ్రీలీల ఎనర్జిటిక్ డాన్స్ లు వెంటనే గుర్తొచ్చేయ్యవూ.. శ్రీలీల క్యూట్ అండ్ స్వీట్ పెరఫార్మెన్స్ కి తోడు ఆమె రవితేజ తో కలిసి ఆడిపాడిన పాటలు ఇప్పటికి యూట్యూబ్ లో మోగిపోతూనే ఉన్నాయి. ధమాకా రిలీజ్ అపుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. ఆతర్వాత శ్రీలీల వలన సినిమా 100 కోట్లు కొల్లగొట్టేసింది. 

ఇప్పుడు మరోసారి రవితేజ-శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. RT 75 చిత్రంలో రవితేజ శ్రీలీల తో రొమాన్స్ చెయ్యబోతున్నాడంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల వరస వైఫల్యాలతో డిజ్ పాయింట్ మోడ్ లో ఉండగా.. రవితేజ కూడా వరసగా సినిమాలు నిరాశ పర్చడంతో హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ పై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు.  

రవి తేజ ల్యాండ్ మార్క్ మూవీ RT 75 ని డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తాడని, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి రవితేజ-శ్రీలీల మరోమారు ఏం మాయ చేస్తారో చూడాలి. 

Dhamaka Combination to Repeat:

Dhamaka Combination to Repeat for Ravi Teja 75th Film

Tags:   DHAMAKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ