Advertisementt

అబద్దం చెప్పనంటున్న హేమ

Mon 27th May 2024 02:01 PM
hema  అబద్దం చెప్పనంటున్న హేమ
Hema doesn't want to lie అబద్దం చెప్పనంటున్న హేమ
Advertisement
Ads by CJ

ఈమధ్యన అబద్దాలు మీద అబద్దాలు చెబుతూ తాను తప్పు చెయ్యలేదంటున్న హేమ మరొకసారి మీడియాకి మరో అబద్దం చెప్పింది. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని కూడా తాను ఆ పార్టీకి వెళ్ళలేదు అంటూ బుకాయిస్తున్న హెమ కిబెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చినా ఇంకా బుకాయిస్తూనే ఉంది. 

ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేసుకోడానికి 100 అబద్ధాలు ఆడాలి, 99% అబద్ధాలు ఆడకుండా ఉండడానికి Try చెయ్యండి, నేను అదే చేస్తాను అందుకే హ్యాపీగా ఉంటాను అంటూ మళ్ళీ మళ్ళి అదే పాట పాడింది. విచారణకు ఈరోజు సోమవారం హాజవ్వాలని పోలీసులు హేమ కి నోటీసులు ఇస్తే.. హేమ మాత్రం తాను విచారణకు రాలేను అంటూ ఓ లేఖని నార్కోటిక్ పోలీసులకి పంపింది. 

తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా.. విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని బెంగళూరు సీసీబీకి హేమ లేఖ రాసింది. దానితో పోలీసులు హేమ కి మరో సారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పరీక్షలో తెల్లగా.. ఆమె విచారణకు రాలేను అని చెప్పడంతో హేమపై సీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Hema doesn't want to lie:

Rave Party: Hema Skips Questioning

Tags:   HEMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ