Advertisementt

కావ్య కంటతడి--ఓదారుస్తూ అమితాబ్ ట్వీట్

Mon 27th May 2024 12:17 PM
kavya maran  కావ్య కంటతడి--ఓదారుస్తూ అమితాబ్ ట్వీట్
IPL: Kavya Maran in Tear కావ్య కంటతడి--ఓదారుస్తూ అమితాబ్ ట్వీట్
Advertisement
Ads by CJ

గత రాత్రి ఐపీఎల్ మ్యాచ్ లో SRH -KKR మధ్య జరిగిన ఫైనల్ పోరులో.. చాలా చెత్తగా ఆడి SRH ఓడిపోగా.. KKR గెలిచి ఈ ఏడాది కప్పు కైవసం చేసుకుంది. దానితో KKR జట్టు ఓనర్ షారుఖ్ సంబరాల్లో మునిగిపోగా.. SRH ఓనర్ కావ్య మారన్ కంటతడి పెట్టుకోవడం పలువురిని కదిలించింది. SRH ఓటమి హైదెరాబాదీయులని, అభిమానులను నిరాశకు గురిచేసింది. 

తన టీం ఓటమితో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీటిపర్యంతమైంది. దానితో క్రికెట్ అభిమానులందరూ చలించిపోయారు. పలువురు ఆమెని ఓదారుస్తూ ట్వీట్లు వేస్తున్నారు. కావ్య మారన్ కన్నీటిని చూసి బిగ్ బి అమితాబ్ ఓదారుస్తూ వేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

IPL అయిపోయింది. ఈ ఏడాది KKR తిరుగులేని విజయం సాధించింది. ఎటు వైపు నుంచి SRH గెలిచేందుకు అవకాశమే లేకుండా పోయింది. SRH ఓటమి అనేక రకాలుగా అందరికి విచారం కలిగిస్తోంది. ఈ సీజన్ మొదలయ్యాక మొదటి మ్యాచ్‌ల్లో SRH అద్భుత ప్రదర్శన చేసింది. SRH ఓటమి ఎలా ఉన్నా ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీరు పెట్టడం ఎంతగానో కదిలించింది. 

తన టీం ఓడిపోయింది అని తెలిసాక ఆమె తన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. చివరకు కెమెరా కంట పడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. కావ్య మారన్ పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. ఎంత బాధ ఉన్నా, రేపటి రోజుకు మళ్లీ నూతనోత్సాహంతో మొదలుపెట్టాలి.. అంటూ అమితాబ్ కావ్య మారన్ ని ఓదారుస్తూ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

IPL: Kavya Maran in Tear:

Kavya Maran Breaks Down, Turns Her Back to the Camera to Wipe Tears as SRH lose

Tags:   KAVYA MARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ