Advertisementt

ఎన్టీఆర్ ఫ్యాన్ ని అనవసరంగా కెలికారు

Sun 26th May 2024 09:44 PM
jr. ntr  ఎన్టీఆర్ ఫ్యాన్ ని అనవసరంగా కెలికారు
NTR fan got angry unnecessarily ఎన్టీఆర్ ఫ్యాన్ ని అనవసరంగా కెలికారు
Advertisement
Ads by CJ

టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎన్టీఆర్ కి టీడీపీ కి సంబంధం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. బుద్ధా వెంకన్న ఏదో మాటవరసకు నాలుగు మాటలను మాట్లాడేసి నిప్పు రాజేసాడు. దానితో ఎన్టీఆర్ అభిమానులు మండిపడిపోతున్నారు. ఏకంగా టీడీపీ నేతలకి సోషల్ మీడియాలో చుక్కలు చూపిస్తున్నారు, బుద్ధా వెంకన్న ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేట్టుగా ఉన్నారు.

ఉదయం బుద్ధా వెంకన్న, లోకేష్ బాబు ని అధ్యక్షుడు గా చేయాలి అంటే ఎవ్వడు దేకలేదు అని, సాయంత్రానికి NTR topic తెచ్చాడు.. 😂 NTR name వాడితేనే అది బ్రేకింగ్ న్యూస్ అవుద్ది అని తెలుసు కున్నాడు.. అందుకే కెలికాడు. 

 పొద్దునేమో లోకేష్ బాబు కి టీడీపీ అధ్యక్షుడు పదవి ఇవ్వాలి అన్నాడు.. ఇప్పుడేమో జూనియర్ NTR కి, టీడీపీ కి సంబంధం లేదు అంటున్నాడు.. బుద్ధా వెంకన్న భలే ప్లానింగ్ లో ఉన్నాడుగా.. ఈ మాట ఏదో ఎలక్షన్స్ ముందు అనుండాల్సింది. ఎన్టీఆర్  అన్నకి

పార్టీతో సంబంధం లేదు అని ఎలక్షన్స్ ముందు ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఈ దొంగ నాటకాలు ఎలక్షన్ ముందు చెప్తే ఓట్లు రావు అనే భయమా...

ఇక ఉండవల్లి అనుషనైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాములుగా ట్రోల్ చెయ్యడం లేదు.. ఆమె కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి.. నీ అభిమానుల్లో కొంతమంది లేకి వెధవల్ని చూస్తుంటే అసహ్యం, కంపరం అన్ని వేస్తున్నాయి బ్రో @tarak9999 అంటూ ఎన్టీఆర్ అభిమానుల దెబ్బకి భయపడి ఎన్టీఆర్ కి చెప్పుకుంటుంది. 

భువనేశ్వరి గారి విషయంలో స్పందించలేదు, ఆ విషయంలో స్పందించలేదు, ఏ విషయంలో స్పందించలేదు అని మా వాడి మీద ఎందుకు పడి ఏడ్చేవారు, మరి పార్టీకి సంబంధం లేనప్పుడు.టిడిపి కి ఓట్లు వేసిన ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ కి ఏమి చెప్పాలనుకుంటున్నారు మీరు.. అంటూ టీడీపీ నేతలపై, బుద్ధా వెంకన్న పై రెచ్చిపోయి వేస్తున్న ట్వీట్స్ చూస్తే బాబోయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అనవసరంగా కెలికేరేమో అనిపించకమానదు. 

NTR fan got angry unnecessarily:

Jr. NTR Fans mass warning to TDP leaders

Tags:   JR. NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ