గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న దేవర షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకి చేరుకుంది. ఎన్టీఆర్ దేవర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో హిందీ డెబ్యూ ఫిలిం వార్ 2 కి డేట్స్ కేటాయించి ఆ షూటింగ్ కోసం ఓ 20 రోజులు ముంబైలోనే ఉన్నాడు. రీసెంట్ గానే బర్త్ డే వీక్ అంటూ భార్య ప్రణతితో కలిసి వెకేషన్స్ కి వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ కి చేరుకున్నాడు
బర్త్ డే రోజున దేవర నుంచి ఫియర్ సాంగ్ ని వదిలారు మేకర్స్, ఈ పాటకి సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా.. ఇప్పుడు క్రికెట్ మైదానంలో, అలాగే మరికొన్ని ఈవెంట్స్ లో ఈపాట వినిపినిపించడం చూసి ఈ సాంగ్ ఎంత హిట్టో చెప్పేస్తున్నారు. అదలావుంటే దేవర నుంచి ఇప్పుడొక న్యూస్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేసింది.
దేవరగా ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. అయితే తాజాగా సముద్రపు ఒడ్డున ఉండే పది ఊళ్ళను కాపు కాసే శక్తివంతమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని, ఇప్పటికే వదిలిన గ్లిమ్ప్స్, ఫియర్ సాంగ్ లో చూపించే యాక్షన్ ఎపిసోడ్ అందులో భాగంగానే వస్తుందని తెలుస్తోంది. సముద్రంలోదొరికే విలువైన సంపద కోసం విలన్ గ్యాంగ్ చేసే కుట్ర తో పది వేల మందితో దాడి చేస్తే వాళ్ళను ఊచకోత కోస్తూ దేవర చూపించే విశ్వరూపం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.
మరి అది నిజమే అనిపించేలా.. ఎర్ర సముద్రం, ఊచకోత అనేది టీజర్ లోనే కాదు.. రీసెంట్ గా ఫియర్ సాంగ్ లోను చూసాము. మరి ఇది వింటే అభిమానులకి గూస్ బంప్స్ రాక ఇంకేమోస్తాయి.