నటీ నటుల వారసులెవరైనా తల్లితండ్రుల వలే నటులు అవ్వడానికే ఇష్టపడతారు. మరి సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార ఏమవ్వాలనుకుంటుందో తెలుసా.. సితార సోషల్ మీడియాలో విపరీతమైనక్రేజ్ ఉన్న స్టార్ కిడ్. ఆమె డాన్స్, అలాగే యాక్టింగ్ స్కిల్స్, ఆమె అందం అన్ని తల్లితండ్రుల నుంచి పుణికి పుచ్చుకున్నట్టుగా ఉంటాయి. చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సొంతగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది.
తాజాగా సితార సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్స్ తో మీటయ్యింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సరదాగా సమాధానాలిచ్చింది. సితార, ఇంట్లో ఎవరు స్ట్రీట్ గా ఉంటారు అని అడిగితే.. ఎవ్వరూ ఉండరని చెపింది, ఇక సితార పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంది అంటే.. నటనని ఎంచుకుంది. నటిని అవుతానని చెప్పింది. తనకి ఇష్టమైన ఫుడ్ మ్యాగీ నూడిల్స్ అని చెప్పిన సితార బ్యూటీ సీక్రెట్ మాత్రం తన పేరెంట్స్ అని చెప్పింది.
తల్లి నమ్రత నుంచి ఫ్యాషన్ సెన్స్ ఉండాలని కోరుకున్న సితార, తండ్రి మహేష్ నుంచి యాక్టింగ్ స్కిల్స్ కావాలని కోరుకుంది. ఇక తనకి ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు అంటే రష్మిక, శ్రీలీల పేర్లు చెప్పింది సితార. ప్రస్తుతం సితార నటి అవుతానని చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.