యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ కార్యకర్తలు ఎటు కాకుండా నలిగిపోతున్నారు. ఎన్టీఆర్ విషయంలో వారు టీడీపీ నేతలకి చెప్పలేరు. అలాగని ఎన్టీఆర్ ని బ్రతిమిలాడలేరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కి దూరంగా ఉంటున్నాడు. రాజకీయాలను పక్కనబెట్టి కేవలం సినిమాలపై ఫోకస్ చేసాడు. కానీ కొంతమంది ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి లాగుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇక టీడీపీ కార్యకర్తల్లో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ టీడీపీ లోకి రావాలని కోరుకుంటున్నారు.
అదంతా ఓకె .. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారడం కాదు.. ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యిరేఖత ఎదుర్కొంటున్నాడు. ఎన్టీఆర్ ఫాన్స్ బుద్ధా వెంకన్నని ట్రోల్ చేస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ని అన్నవాళ్ళని ఏమి అనలేక, నే టీడీపీ లోకి రమ్మనలేక నలిగిపోతున్నారు.
బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు.. పెద్దాయన(సీనియర్ ఎన్టీఆర్) పెట్టిన పార్టీ మీద అభిమానం చంపుకోలేము, అలాగని నీ మీద ( జూనియర్ ఎన్టీఆర్) చిన్న మాట పడినా తట్టుకోలేము, ఏమి లేకి వెధవల్ని పెట్టుకున్నార్రా పార్టీలో అంటూ(బుద్ధా వెంకన్న) పై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.