నందమూరి బాలకృష్ణ ఏపీ లో టీడీపీ నుంచి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా పోటీ చేసారు. ఎన్నికల్లో గెలిచేందుకు బాలయ్య ఎండలో ప్రచారం చేస్తూ కష్టపడ్డారు. ఎన్నికలు ముందు బాబీ దర్శకత్వంలో NBK 109 షూటింగ్ లో బిజీగా కనిపించారు. మహాశివరాత్రి స్పెషల్ గా విడుదలైన NBK 109 గ్లిమ్ప్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఇంప్రెస్స్ చేసాయి.
అదలా ఉంటే ప్రస్తుతం ఎన్నికల హీట్ నుంచి రిలాక్స్ అవుతున్న బాలకృష్ణ NBK 109 షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపులో కాజల్ సత్యభామ, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ లో చీఫ్ గెస్ట్ గా బాలయ్య పాల్గొంటున్నారు. ఇక ఈ రోజు ఆదివారం బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో బాలయ్యకి మంచి అనుబంధం ఉంది. గతంలో వీరు టీడీపీ లో కలిసి పని చేసారు. ఇక సీఎం అయ్యాక రేవంత్ రెడ్డిని అనేకమంది సినీ సెలబ్రిటీస్ కలిసినా బాలయ్య కలవలేదు. ఈరోజు మర్యాదపూర్వకంగా బాలకృష్ణ రేవంత్ రెడ్డి ని కలిసి పుష్ప గుచ్చం అందించారు. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.