పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో మరికొద్ధి రోజుల్లో మొదలు కాబోయే సలార్ సౌర్యంగా పర్వ చిత్ర షూటింగ్ ఆగిపోయింది అని నిన్న శనివారం సోషల్ మీడియాలో ఎక్స్ క్లూసివ్ న్యూస్ అంటూ పలు వెబ్ సైట్స్ ప్రముఖంగా ప్రచురించాయి. కొన్ని సాంకేతిక కారణాల వలన సలార్ 2 ఆగిపోయింది అంటూ రాసుకొచ్చారు.
అందుకే ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ చిత్రం పైకి వెళ్లిపోతున్నారు, ఆగష్టు నుంచి NTR 31 ని పట్టాలెక్కించేపనిలో ఉన్నారు అంటూ రాసారు.
మరి రేపో మాపో సెట్స్ మీదకి వెళ్లబోతుంది అనుకున్న సమయంలో సలార్ 2 పై వచ్చిన ఈ వార్తతో ప్రభాస్ ఫాన్స్ అప్ సెట్ అయ్యారు. మరి ఈ వార్త మేకర్స్ వరకు వెళ్లడంతో.. ఈ రోజు సలార్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ప్రభాస్-ప్రశాంత్ నీల్ నవ్వుతూ ఉన్న సలార్ పార్ట్ 1 వర్కింగ్ స్టిల్ వదిలారు.
ఈ స్టిల్ ఒక్కటి చాలు.. సలార్ ఆగిపోయింది అని వస్తున్న వార్తలకు అడ్డుకట్ట వెయ్యడానికి. మరి సలార్ పార్ట్ 1 హిట్ అయ్యాక, పార్ట్ 2 పై బోలేడన్ని అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో ఆగిపోయింది అనే వార్తలు వినిపిస్తే పాన్ ఇండియా మార్కెట్ లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండడంతోనే మేకర్స్ ఇలా వర్కింగ్ స్టిల్ తో ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.