ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ ఎప్పుడెప్పుడు NBK109 సెట్స్ లోకి వెళదామా అని వెయిట్ చేస్తున్నారు. రాజకీయాల్లో కాస్త ఫ్రీ అవ్వగానే ఆయన వెంటనే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేసినా.. దర్శకుడి బాబీ తదుపరి షెడ్యూల్ ని మొదలు పెట్టకపోవడంతో తన కో స్టార్ కాజల్ ఆహ్వానించింది కదా అని సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్ఛినట్టుగా ఆయన చెప్పారు.
మరి అటు పాలిటిక్స్, ఇటు సక్సెస్ రేట్ తో క్రేజీగా ఉన్న బాలకృష్ణని కాజల్ పర్ఫెక్ట్ టైమ్ లో ప్రేక్షకుల ముందుకు తన ఈవెంట్ కోసం తీసుకొచ్చింది. ఇప్పుడు మరో కుర్ర హీరో తన సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్యని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది.
అతనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో విశ్వక్ సేన్. బాలయ్య తో అన్ స్టాపబుల్ లో పాల్గొని రచ్చ చేసిన విశ్వక్ సేన్ ఈసారి తన సినిమా గాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషనల్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలక్రిష్ణని గెస్ట్ గా తీసుకురాబోతున్నాడట. మరి నిన్న కాజల్, ఇప్పుడు విశ్వక్ సేన్ బాలయ్యని భలేగా వాడేస్తున్నారుగా అంటూ నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.