ఏ సెలబ్రేషన్స్ కి సిద్దమైపోవాలి అనే కదా.. మీరు ఆలోచించేస్తున్నారు. సంబరాలకు సిద్దమైపోండి అంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ చెబుతుంది. ఎందుకో తెలుసా.. జగన్ ప్రమాణ స్వీకారానికి అంట. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది కదు ఈ టైటిల్ చూస్తే. మరి ఏంటనుకున్నారు. మే 13 న అలా ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇలా వైసీపి నేతలంతా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.
రోజుకొకరు మీడియా ముందు ఈసారి కూడా వైసీపీ దే గెలుపు. జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ మరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. బొత్స సత్యన్నారాయణ, అంబటి, రోజా, కొడాలి, వైవీ సుబ్బారెడ్డి ఇలా జగన్ మళ్లి సీఎం అవుతారంటూ ప్రెస్ మీట్స్ లో చెబుతున్నారు. వాళ్లేమిటి స్వయంగా జగన్ కూడా ప్రకటించాడు.
అంతేకాదు జూన్ 4న 2019 కి మించిన భారీ విజయంతో చరిత్ర తిరగరాయనున్న జగనన్న, భారీ మెజారిటీతో వైసీపీ గెలుపు, వైజాగ్ లో జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియా వింగ్స్ కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి సమయాన్ని తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు.
అంటే జగన్ సీఎం అని అందరి మైండ్స్ లో బలంగా ముద్ర వేసేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రిజల్ట్ రాలేదు. కానీ అప్పుడే మంచి రోజులు, ముహుర్తాలు అంటూ జగన్ టీం తెగ హడావిడి చేస్తుంది.