ఆర్.ఆర్.ఆర్ లో సీత పాత్రలో అలియా భట్ ని చూసాక టాలీవుడ్ స్టార్ హీరోలంతా అలియా భట్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్నారు. ఆ మూమెంట్ లోనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రమైన దేవర లో అలియా భట్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసి ఆమె బర్త్ డే రోజున దేవర ప్రాజెక్ట్ లోకి వెల్ కమ్ చెబుతూ అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చారు.
కట్ చేస్తే అలియా భట్ ప్రెగ్నెన్సీ కారణంతో దేవర నుంచి తప్పుకుంది, ఆ తర్వాత జాన్వీ కపూర్ వచ్చింది. మరి అలియా భట్ ఇప్పుడు ఫిట్ గా మారింది, సినిమాలు చేస్తుంది. రాహా పుట్టింది, వన్ ఇయర్ అయ్యింది, అలియా భట్ కూడా పర్ఫెక్ట్ ఫిగర్ లోకి వచ్చేసింది. కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేస్తుంది. అంతా బాగానే ఉంది.
దేవర వద్దనుకున్న అలియా భట్ ని తరవాత తెలుగు హీరోలెవరూ పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. లేదంటే రామ్ చరణ్ కొత్త సినిమా మొదలు పెట్టాడు, దానిలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఇక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రంలో రష్మిక పేరు వినిపిస్తోంది. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ ఇలా వరసగా వారి కొత్త సినిమాలు మొదలవుతాయి. అందులో ఎమన్నా ఈ క్యూటీ పేరు వినిపిస్తుందేమో చూడాలి.