కోలీవుడ్ హీరో శింబు చాలా ఏళ్లు సక్సెస్ కి దూరంగా నిరాశలో కనిపించాడు. కానీ మానాడు తో శింబు ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసాడు. రీ ఎంట్రీతో సూపర్ హిట్ అందుకున్న శింబు ప్రస్తుతం క్రేజీ క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. అందులో శింబు కమల్ హాసన్ తో కలిసి మణిరత్నం మూవీ థగ్ లైఫ్ నటిస్తుండగా.. కమల్ నిర్మాతగా దేశింగు పెరియాస్వామి దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు.
దేశింగు పెరియాస్వామి దర్శకత్వంలో శింబు చేస్తున్న చిత్రంలో శింబు ఇద్దరు బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేయబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అది కూడా అలాంటి, ఇలాంటి భామలు కాదు.. ప్రస్తుతం గ్లోబర్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లతో శింబు రొమాన్స్ చెయ్యబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాలో శింబు డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆ రెండు పాత్రల కోసం కియారా - జాన్వీ లని మేకర్స్ సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కియారా ప్రస్తుతం రామ్ చరణ్-ఎన్టీఆర్ చిత్రాల్లో నటిస్తుండగా.. జాన్వీ కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాల్లో నటిస్తుంది. ఇలాంటి క్రేజీ హీరోయిన్స్ తో శింబు నటించడం అంటే.. మాములు విషయం కాదు కదా!