దొంగతనం చేసి పట్టుబడినా నేను దొంగను కాదు అని బుకాయిస్తే వదిలేస్తారా.. అస్సలు వదలరు. ఇప్పుడు నటి హేమ విషయంలో అదే జరిగింది. సినీ నటి హేమ బెంగుళూరు రేవ్ పార్టీలో మారుపేరు కృష్ణవేణి పేరుతొ పాల్గొని.. అక్కడ ఫామ్ హౌస్ పై జరిగిన రైడ్ లో పట్టుబడి.. లేదు నేను రేవ్ పార్టీకి వెళ్ళలేదు, ఫామ్ హౌస్ లో ఛిల్ అవుతున్నా అంటూ బుకాయించింది.
కానీ పోలీసులు ఊరుకోరు కదా హేమ శాంపిల్స్ సేకరించడమే కాదు.. అందులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేల్చారు. అయినా హేమ దానిని నుంచి డైవర్ట్ చేసేందుకు రకరకాలుగా ట్రై చేస్తుంది. బిర్యానీ చేస్తూ, ఆవకాయ పచ్చడి పడుతూ వీడియోస్ వదిలింది. మరి హేమ రేవ్ పార్టీ పై పోలీసులని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది అని చాలామంది కామెంట్ చేసారు.
ఈ విషయంలో సీరియస్ గా ఉన్న పోలీసులు హెమ కి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10గంటలకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు రావాలని పేర్కొన్నారు. హేమ మాత్రమే కాదు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, అశీరాయ్, కాంతి, రాజశేఖర్, సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు.