Advertisementt

క్రికెట్ స్టేడియాన్ని ఊపేసిన దేవర సాంగ్

Sat 25th May 2024 01:23 PM
devara  క్రికెట్ స్టేడియాన్ని ఊపేసిన దేవర సాంగ్
Devara song played in the cricket stadium క్రికెట్ స్టేడియాన్ని ఊపేసిన దేవర సాంగ్
Advertisement
Ads by CJ

అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. దేవర మ్యూజిక్ తో నిరాశ పరిచాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా దిగులుపడుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే రోజున వదిలిన దేవర ఫియర్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోలేదు. 

పుష్ప ఫస్ట్ సింగిల్ ముందు దేవర ఫస్ట్ సాంగ్ తేలిపోయింది అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫాన్స్ చేసిన హడావిడిలో ఎన్టీఆర్ ఫాన్స్ డిజ్ పాయింట్ అయ్యారు. సోషల్ మీడియా టాక్ ఎలా ఉంటే ఏమిటి.. గత రాత్రి SRH-KKR మ్యాచ్ లో జరిగిన ఉత్కంఠ పోరులో SRH గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లింది. దానితో స్టేడియం లో దేవర పాటకి డాన్స్ చేస్తూ SRH అభిమానులు పూనకాలతో ఊగిపోయిన వీడియోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

దేవర ఫియర్ సాంగ్ కి అభిమానులు స్టెప్స్ వేస్తూ ఊగిపోవడం చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిలాక్స్ అవడమే కాదు.. అది ఆయన రేంజ్... నిన్న మ్యాచ్ లో 🔥 దేవర ముంగిట నువ్వెంత 💥అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజమే కదా.. సాంగ్ బాలేదు అనే కామెంట్స్ చూసి బాధపడేవారికి ఇలాంటి వీడియోస్ ఊపిరిపోస్తాయి. 

Devara song played in the cricket stadium:

Devara Fear song played in the cricket stadium

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ