Advertisementt

షాకింగ్: ఆగిపోయిన సలార్ 2?

Sat 25th May 2024 12:36 PM
prabhas  షాకింగ్: ఆగిపోయిన సలార్ 2?
Salaar 2 shelved షాకింగ్: ఆగిపోయిన సలార్ 2?
Advertisement
Ads by CJ

ప్రభాస్-పృథ్వీ రాజ్ సుకుమారన్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 గత ఏడాది విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది సలార్ కి సీక్వెల్ గా సౌర్యంగ పర్వగా సలార్ పార్ట్ 2 షూటింగ్ త్వరలోనే మొదలు కావాల్సి ఉంది. ఈ నెలలోనే సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. 

దానికి సంబందించిన పనులు కూడా ప్రశాంత్ నీల్ మొదలు పెట్టారు. ఇటు ప్రభాస్ కూడా కల్కి షూటింగ్ పూర్తవడంతో మరికొద్ది రోజులో సలార్ 2 షూట్ లో పాల్గొంటారని చెబుతున్న సమయంలో సలార్ 2 ఆగిపోయింది అనే న్యూస్ ప్రభాస్ ఫాన్స్ కే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులకి షాకిచ్చింది. కొన్ని కారణాల వలన సలార్ 2 ఆగిపోయింది అనే వార్త ప్రముఖంగా వినిపించడం అందరికి షాకిచ్చింది. 

ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 ని పక్కనపెట్టేసి ఎన్టీఆర్ తో చెయ్యబోయే NTR 31 ప్రీ ప్రొడక్షన్ లోకి వెళ్లిపోయారని.. అందుకే మైత్రి మూవీస్ వారు కూడా ఎన్టీఆర్-నీల్ మూవీ ఆగష్టు నుంచి సెట్స్ మీదకి వెళ్తుతుంది అని కాన్ఫిడెంట్ గా అధికారిక ప్రకటన ఇచ్చారంటూ చెబుతున్నారు. మరి సలార్ 2 షూటింగ్ ఆగిపోతే ఎలా అనేది అభిమానుల ప్రశ్న. అసలు ఈ వార్త నిజమా.. కాదా.. అనేది తెలియాల్సి ఉంది. 

Salaar 2 shelved:

Prabhas Salaar 2 shelved

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ