కూటమి గెలిస్తే పవన్‌కు మంత్రికి మించి పదవి!
జూన్ -4 తర్వాత పవన్‌కు కీలక బాధ్యతలు!
ఏపీలో కూటమి గెలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కీలక బాధ్యతలు దక్కనున్నాయి. అవునా.. అదేంటి వైసీపీని ఓడించడానికి అహర్నిశలు కష్టపడిన సేనానికి మంత్రి, డిప్యూటీ సీఎం ఇస్తారు ఇందులో కొత్తేం ఉంది అనుకుంటున్నారు కదా..? అస్సలు కాదండోయ్ అంతకు మించే పదవి. మంత్రిని మించిన పదవి ఏంటి..? ఇంతకీ ఏంటది..? ఏమిటా కీలక బాధ్యతలు అనే కదా మీ సందేహాలు రండి.. తెలుసుకుందాం..!
కష్టానికి ఫలితం!
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టి.. అధికారంలోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మూడు పార్టీలు ఏకం కావడానికి, కూటమి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ శ్రమ అంతా ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే కర్త, ఖర్మ, క్రియ అన్నీ సేనానినే.! సేనాని కష్టాన్ని, శ్రమను.. నీతి నిజాయితీని గుర్తించిన బీజేపీ.. ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలని భావిస్తోందట. ఏపీలో ఎలాగైనా.. ఎప్పటికైనా బలపడాల్సిందే, అధికారంలోకి రావాల్సిందే అనేది కమలనాథుల మాస్టర్ ప్లాన్. అందులో భాగంగానే.. జూన్ నాలుగో తేదీన ఫలితాలు ఎలా ఉన్నా అంటే.. కూటమి గెలిచినా, ఓడినా.. పవన్ పిఠాపురంలో కూడా ఓడినా సరే కళ్యాణ్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టడానికి బీజేపీ పెద్ద తలకాయలు సిద్ధం అయ్యారట.
ఏం పదవి.. ఏంది కథ..!!
ఏపీ ఎన్డీఏ చైర్మన్‌గా పవన్ కళ్యాణ్‌ను నియమించాలని బీజేపీ పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా ఫిక్స్ అయినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జనసేన పార్టీని విలీనం చేయాలా వద్దా అన్నది పవన్ ఛాయిస్ అట. ఒకవేళ విలీనం ఉంటే సేనానికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి.. కేంద్రంలో కీలక పదవి కూడా ఇస్తారట. తెలుగు రాష్ట్రాల్లో కమలం వికసించే ఛాన్సే లేదన్న పరిస్థితి నుంచి.. తెలంగాణలో ఎలా బలపడింది అనేది మనం స్వయంగా చూశాం. ఇలాగే ఏపీలో కూడా ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనేది అటుంచితే కమలం టార్గెట్ 2029లో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకుని తర్వాతి ఎన్నికల్లో ఏపీని ఏలాలన్నదే టార్గెట్ అంట. అందుకే కష్టజీవి, ఏపీ గురుంచి బాగా తెలిసిన పవన్‌ను ఏపీ ఎన్డీఏ చైర్మన్‌గా చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలియనుంది. అసలు ఫలితాలు వచ్చాక టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయేలో ఉంటాయా లేదా అన్నది కూడా కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.