రష్మిక మందన్న సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ చూస్తే చాలామంది వాటిని.. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఫొటోస్ ని పక్క పక్కన పెట్టి చూస్తారు. ఎందుకంటే వీరిద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నప్పటికీ.. కాదు మేము ఫ్రెండ్స్ అని చెబుతూ కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, బర్త్ డే పార్టీలు ఎంజాయ్ చెయ్యడం చేస్తూ ఉంటారు. అందుకే నెటిజెన్స్ కూడా వీరు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని కాచుకుని కూర్చుంటారు.
తాజాగా రష్మిక మందన్న పెంపుడు జంతువులతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పెట్స్ తో రష్మిక ఆడుకుంటూ ఉన్న పిక్స్ అవి. ఒకదానిలో రష్మిక పెంపుడు కుక్క, మరొకదానిలో ఆమె పెంపుడు పిల్లి, ఇంకోదానిలో మరో పెంపుడు కుక్క తో రష్మిక కనిపించగానే.. అది VD డాగ్ కదా అంటూ నెటిజెన్స్ అనుమానాలు వ్యకం చేసేసారు.
విజయ్ దేవరకొండ పెంపుడు కుక్కతో రష్మిక దిగిన ఫోటోని కూడా షేర్ చేసేసింది. రష్మిక హైదరాబాద్ లో విజయ్ ఇంట్లోనే ఉంటుంది. అందుకే అతని పెంపుడు కుక్కతో కూడా బాండింగ్ వచ్చేసింది. ఇది అదే ఫోటో అంటూ కామెంట్ చెయ్యడం చూసి.. అయ్యో మళ్ళి దొరికిపోయావా రష్మికా అంటూ మరికొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.