నందమూరి నటసింహం రాజకీయ ప్రచారంలో అలిసిపోయి ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. హిందూపురం ఎమ్యెల్యే కంటెస్టెంట్ గా పోటీ చేసిన బాలకృష్ణ రెండు నెలల పాటు రాజకీయ రణరంగంలో కొట్టుమిట్టాడారు. ఆయన నటిస్తున్న NBK 109 షూటింగ్ కూడా బ్రేకిచ్చేసారు. ఇక ఎలక్షన్ ముగిసింది. ఫలితాల కోసం వెయిటింగ్ చేస్తున్నారు.
అయితే ఏపీలో ఎలక్షన్ వేడి ముగియగానే బాలయ్య ఇమ్మిడియట్ గా NBK 109 సెట్స్ లోకి వచ్చేస్తారని అన్నారు. కొంతమంది అయితే బాలయ్య షూటింగ్స్ కి హాజరవుతున్నారు అన్నారు. కానీ తాజాగా బాలకృష్ణ తాను కూడా ఎన్నికలు ముగిసాక NBK 109 సెట్స్ లోకి వెళ్లిపోదామనుకున్నాను, కానీ ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు అంటూ సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పారు.
కాజల్ అగర్వాల్ లేటెస్ట్ చిత్రం సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలయ్య గెస్ట్ గా హాజరయ్యారు. ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. తాను ఎన్నికల తర్వాత వెంటనే షూటింగ్ లో జాయిన్ లో అయ్యిపోవాలని వచ్చేసాను అని, అయితే ఆ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు, కానీ ఈ రెండు నెలలు తాను కెమెరాని మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు.
కొన్నేళ్లుగా బాలయ్య ఫుల్ స్వింగ్ లో సినిమాలు, అన్ స్టాపబుల్ షోస్ తో నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకే రెండు నెలలుగా కెమెరాకి గ్యాప్ వచ్చేసరికి ఆయన దానిని మిస్ అవుతున్నట్టుగా ఫీలవుతున్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.