అవును.. మీరు వింటున్నది, చదువుతున్నదీ అక్షరాలా నిజమే.! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ ఫుల్ క్లారిటీతో ఉంది. ఇందుకు ఏర్పాట్లు కూడా ప్రభుత్వ అధికారులు, పార్టీ నేతలు శరవేగంగా చేసేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తమ అభిమాన నేత ప్రమాణ స్వీకారోత్సవం చూడాలని కొందరు.. జగన్ రెడ్డిని ఈసారైనా నేరుగా చూడాలని ఇంకొందరు దేశ, విదేశాలలో ఉండే వీరాభిమానులు విశాఖలో వాలిపోతున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే కుటుంబ సమేతంగా వైజాగ్ వచ్చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పదిరోజుల ముందే విశాఖపట్నంలో ప్రముఖ హోటల్స్, లాడ్జిలు అన్నీ బుక్కయ్యాయి. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.
ఆ కిక్కే వేరబ్బా..!
చూశారుగా వైజాగ్ పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉందో..!ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల ఫలితాలు వచ్చాక సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదూ. ఏపీలో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది.. నిన్న, మొన్నటి వరకూ అదిగో కూటమి వస్తోంది.. వచ్చేస్తోంది.. అమరావతి వేదికగా చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని హడావుడి చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు.. కార్యకర్తలు, వీరాభిమానులు ఎందుకో సైలెంట్ అయ్యారు. దీంతో వైసీపీ వీరాభిమానులు రెచ్చిపోతున్నారు.
జగన్ ఎంట్రీతో..!
ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని నేతలు, కార్యకర్తలు గట్టి నమ్మకంతోనే ఉన్నారు. వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి గెలుస్తున్నామనే చెప్పడం సంగతి అటుంచితే.. ఎప్పుడైతే అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి రాజధాని విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పడంతో అప్పుడు ఇక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దేశం మొత్తం మనవైపు చూసేలా ఫలితాలు ఉంటాయని ఏ నిమిషాన ఐతే చెప్పారో ఆ కాన్ఫిడెన్స్ కార్యకర్తలకు ఎక్కడలేని కిక్కు ఇచ్చింది. దీంతో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. దీనికి తోడు పార్టీలో పెద్ద తలకాయలుగా ఉన్న బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి విశాఖపట్నంలో జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు రెండోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు.
ఏం నడుస్తోంది..?
వైసీపీ ధీమా ఏమిటంటే.. మనిషిలో కృతజ్ఞత లేదనుకుంటే తక్కువలో తక్కువ 105 సీట్లు లేదంటే కృతజ్ఞత, విశ్వాసముంటే 151 పైనే సీట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తాయని.. మధ్యలో ఆగే ప్రసక్తే ఉండదని పార్టీ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి. అందుకే ఈ ధీమాతోనే.. వైసీపీ నేతల హడావుడితో జూన్ 7,8,9 తేదీల్లో రూమ్స్ బుక్ చేసుకున్నారు. దీంతో.. వైజాగ్ లోని హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయని ఏకంగా టీడీపీ అనుకూల, వైసీపీ అంటే అస్సలు పడని.. నిత్యం విషం కక్కే ఛానెళ్లలో ఇలాంటి వార్తలు వస్తుండటం ఆలోచించాల్సిన విషయమే. ఇంత రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు రేపు పొద్దున్న పార్టీ గెలవకపోతే పరిస్థితి ఏంటి..? బుక్కింగ్స్ అన్నీ ఏం చేస్తారో చూడాలి మరి.