Advertisementt

హేమని ఆడుకుంటున్న టీవీ ఛానల్స్

Fri 24th May 2024 05:47 PM
hema  హేమని ఆడుకుంటున్న టీవీ ఛానల్స్
Hema Bangalore Flight Ticket Revealed హేమని ఆడుకుంటున్న టీవీ ఛానల్స్
Advertisement
Ads by CJ

సినీ నటి హేమ కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించడం మానేసింది. ఆమెకి కేరెక్టర్స్ రావడం లేదో.. లేదంటే ఆమె నటనకు దూరంగా ఉంటుందో కానీ.. హేమ వెండితెర మీద కనిపించి చాలా కాలమే అయ్యింది. అయితే హేమ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కారణం బెంగుళూరు రేవ్ పార్టీ. 

ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన హేమ తాను ఆ పార్టీకి వెళ్ళలేదు అంటూ బుకాయించడమే కాదు, తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన ఎవ్వరికి వదలనంటూ హెచ్చరించింది. కట్ చేస్తే బెంగుళూరు రేవ్ పార్ట్ లో దొరిన వారిలో డ్రగ్స్ నమూనా శాంపిల్స్ సేకరిస్తే.. అందులో హెమ కూడా ఉంది. హేమ శాంపిల్ పాజిటివ్ గా రావడమే కాదు.. ఆమె ఎవ్వరికి దొరక్కుండా ఉండేందుకు కృష్ణవేణి పేరుతో ఈ పార్టీకి హాజరైంది. 

పోలీసులు కూడా హేమ ఫోటొస్ ని రివీల్ చేసినా ఆమె పేరు కృష్ణవేణి గానే FIR లో రాసుకున్నారు. అంత పకడ్బందీగా హేమ ప్లాన్ చేసింది. అందుకే బుకాయించి తాను రేవ్ పార్టీకి వెళ్ళలేదు అని చెప్పాలనుకుంది. కానీ మీడియా ఊరుకుంటుందా హేమని వెంటాడింది, తాజాగా హేమ తన పేరు మీదే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ ని పలు ఛానల్స్ చేజిక్కించుకున్నాయి. 

టీవీ ఛానల్స్ లో హేమ ఫ్లైట్ టికెట్ హైలెట్ అవడం చూసిన వారు.. పోలీసులు ఏమో కానీ.. ఛానల్స్ హేమని వదిలేలా లేవు అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Hema Bangalore Flight Ticket Revealed :

Hema Bangalore Flight Ticket In TV Channels 

Tags:   HEMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ