సెలబ్రిటీస్ తల్లవడానికి ఏంతో ఆతృతగా ఉన్నప్పటికీ.. అందం విషయంలో తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అంతేకాకుండా సెలెబ్రిటీస్ లేట్ మేరేజెస్ కూడా తల్లవడానికి ఆలస్యమయ్యేలా చేస్తుంది. ఇక కొంతమంది సెలబ్రిటీస్ ఆరోగ్య కారణాల వలనో, లేదంటే మారేదన్నా కారణాల చేతనో సరోగసిని సంప్రదించి పేరెంట్స్ గా మారుతున్న వారిని చూస్తున్నాం.
తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రెగ్నెన్సీని ఆమె భర్త స్టార్ హీరో రణవీర్ కపూర్ అనౌన్స్ చేసినప్పటినుంచి దీపికా పదుకొనే నిజంగానే తల్లవుతుందా.. ఆమె ప్రెగ్నెంట్ నిజమా? కాదా? సరోగసి ద్వారా తల్లవుతుందా అంటూ చాలామంది చాలా అనుమానాలు వెలిబుచ్చారు. రీసెంట్ గా దీపికా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. దానితో ఆమె సరోగసి రూమర్స్ కి చెక్ పడింది.
తాజాగా దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అయ్యాక మొదటిసారి ఓ ఈవెంట్ కి హాజరైంది. ఎల్లో ఫ్రాక్ లో దీపికా పదుకొనె బ్రైట్ గా కనిపించింది. కానీ లూజ్ డ్రెస్ లో దీపికా పదుకొనే తన బేబీ బంప్ కనిపించకుండా కవర్ చేసేసింది. కాస్మొటిక్ బ్రాండ్ ని ప్రమోట్ చేసేందుకు వచ్చిన దీపికా పదుకొనె మోహంలో ఆ ప్రెగ్నెన్సీ తాలూకు మెరుపు స్పష్టంగా కనిపించింది.