హైదరాబాద్ అంటే దేశం నలుమూలల నుంచి ఎంతోమంది వలస వచ్చి చిన్నపని, పెద్ద పని చేసుకుంటూ పండగలకి, పబ్బాలకి సొంత ఊళ్ళకి వెళ్లి అయినవారిని కలిసి సేద తీరుతూ ఉంటారు. ముంబై, చెన్నై లాంటి మహానగరాలు ఉన్నప్పటికీ.. ఎక్కువమంది హైదరాబాద్ వైపే చూస్తారు. ఇక్కడ హైదరాబాద్ లో ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదాం అనుకునేవాళ్లు కోకొల్లలు.
అలా ఏపీ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అద్దెకి ఇల్లులు తీసుకుని ఎంతోకొంత సంపాదించుకుంటూ పిల్లలని చదివించే వాళ్ళు, అలాగే వలస కూలీలు, కోర్స్ లు నేర్చుకునే విద్యార్థులు, ఐటీ జాబులు చేసుకునేవారు, మిగతా ఉద్యోగాలంటూ చాలామంది హైదరాబాద్ మహానగరాన్ని చేరుకుంటున్నారు. ఉన్నకొలది ఇక్కడ పాపులేషన్ పెరిగిపోతుంది. అయితే అందులో చాలామంది అంతో ఇంతో కూడబెట్టుకుని సొంతిల్లు కొనుకున్నవారు ఉన్నారు. కొంతమంది అద్దె ఇంట్లోనే ఉన్నవారు ఉన్నారు.
ఇప్పుడు సడన్ గా హైదరాబాద్ వ్యాప్తంగా అద్దె ఇళ్ల ధరలు అమాంతం పెంచేశారు ఇంటి ఓనర్స్. 10 వేలు ఉండే ఇంటికి 18 నుంచి 20 వేలు, 15 వేలు ఉండే ఇంటికి 20 నుంచి 25 వేలు, 20 వేలు ఉన్న ఇంటిని 30 వేలు వరకు అంటే ఉన్నాడు డబుల్ రెంట్ పెంచేశారు. అద్దెకి ఇల్లు కోసం వెతికే వారికి ఆ రేంజ్ రెంట్స్ షాకిస్తున్నాయి.
ఎన్నడూ లేనిది ఈ ఏడాది జనవరి నుంచి అద్దె ఇంటి ధరలకు రెక్కలొచ్చాయి. డబుల్ బెడ్ రూమ్ కావాలంటే 20 వేలు అదీ మాములు ఏరియాలో, అదే ప్రైమ్ ఏరియాలో 25 నుంచి 30 వేలు రెంట్ అంటూ చెబుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఓకె. అన్ని సదుపాయాలు ఉంటాయి, అంత అద్దె చెప్పినా అందం. కానీ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేకపోయినా అద్దెలు పెంచెయ్యడమనేది షాకింగ్ అనే చెప్పాలి.
10 వేలు, 20 వేలు సంపాదించుకునేవారు పెరిగిన అద్దె కట్టాలంటే సంపాదించిన దానిలో సగం అద్దెకి వెళ్లిపోతుంది అని దిగాలు పడుతున్నారు. ఐటి ఉద్యోగులు ఇంత రెంట్ చెల్లిస్తారు కానీ.. చిన్న చిన్న ఉద్యోగస్తులు అంత అద్దె భరించడం చాలా కష్టం. మరి హైదరాబాద్ కి ఉన్నట్టుండి ఏమైందో అంటూ చాలామంది ఈ పెరిగిన అద్దెల గురించే చర్చించుకుంటున్నారు.