అల్లు అర్జున్ తో పుష్ప తో పాన్ ఇండియా హిట్టు కొట్టి హిందీలో హీరోయిన్ గా నిరూపించుకున్న రష్మిక మందన్న వైపు టాలీవుడ్ స్టార్ హీరోలవరూ చూడకపోవడం ఆమె అభిమానులని డిజ్ పాయింట్ చేస్తూనే ఉంది. పుష్ప బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రశ్మికకి హిందీ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచింది. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం లైట్ తీసుకున్నారనిపించేలా ఉంది వ్యవహారం.
ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వీళ్లంతా కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టినా హీరోయిన్ గా రష్మికని కన్సిడర్ చెయ్యలేదు. దానితో రష్మిక నిరాశపడిందో లేదో కానీ.. ఆమె అభిమానులు ఉసూరుమన్నారు. ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ RC 16 లో జాన్వీ కపూర్ ని హీరోయి గా సెట్ చేసుకున్నారు. ఇక ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్స్ తో పాటుగా.. సౌత్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న రష్మిక విషయంలో లైట్ గా ఉన్నాడు.
కానీ ఇప్పుడు రశ్మికకి ఎన్టీఆర్ తో ఛాన్స్ తగిలేలా కనిపిస్తుంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో ఆగష్టు లో మొదలు కాబోయే NTR 31 చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రష్మిక పేరు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. మరోపక్క కియారా పేరు వినిపిస్తున్నా.. ఆమె ఆల్రెడీ వార్ 2 లో నటిస్తుంది. సో ఈసారి రశ్మికకి ఎన్టీఆర్ ఛాన్స్ మాత్రం తగిలేలా కనబడుతుంది.