నిన్నమొన్నటివరకు శాంతను తో రిలేషన్ లో ఉన్న కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ఇప్పుడు సింగిల్ ట్యాగ్ తగిలించుకుంది. శాంతను తో శృతి హాసన్ బ్రేకప్ చేసుకుంది. శాంతానుతో డేటింగ్ లో ఉన్నప్పుడు ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసిన శృతి హాసన్ బ్రేకప్ విషయాన్ని మాత్రం దాచేసింది. కానీ శాంతను మాత్రం ఈ బ్రేకప్ పై ఓ క్లారిటీ ఇచ్చేసాడు.
తాజాగా శృతి హాసన్ కూడా శాంతానుతో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఇన్స్టా ఇంట్రాక్షన్ లో వచ్చిన మీరు సింగిలా అన్న ప్రశ్నకి శృతి హాసన్ తనకి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు చెప్తానని, తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను అని చెప్పింది.
అంతేకాదు ప్రస్తుతం తాను సింగిల్ కేవలం నా వర్క్, లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడంలో మాత్రమే మింగిల్ అవ్వడానికి ఇష్టపడతాను అంటూ శాంతను తో బ్రేకప్ విషయాన్ని ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసింది.