మూడు నెలలుగా ఇంట్రస్టింగ్ గా ఉన్న సినిమాలు ఏవి థియేటర్స్ లో విడుదల కావడం లేదు, టిల్లు స్క్వేర్ తర్వాత ఫ్యామిలీ స్టార్ ఎమన్నా ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేస్తుంది అనుకుంటే అది కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత ఎలక్షన్ ఫీవర్ లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పడి కొట్టుకోవడంతో నిర్మాతలెవరూ సినిమాలు విడుదల చేసే సాహసం చెయ్యలేదు.
అదిగో ఎన్నికల ముందు సత్యదేవ్ కృష్ణమ్మ విడుదల చేస్తే.. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అవడంతో కృష్ణమ్మ వారం తిరక్కుండానే ఓటీటీలో ప్రత్యక్షమైంది.
ఇక ఈ వారం రాజు యాదవ్, లవ్ మీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. శుక్రవారం విడుదలకి సిద్దమైన ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో బజ్ లేదు. ఇక వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ మే 31 న విడుదల తేదీలు ప్రకటించిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కాజల్ సత్యభామ, సుధీర్ బాబు హరోం హర చిత్రాలు ఆసక్తిగా కనిపించాయి.
కానీ ఇప్పుడు మే 31 నంచి కాజల్ సత్యభామ జూన్ 7 కి పోస్ట్ పోన్ అయ్యింది. అలాగే సుధీర్ బాబు హరోం హర కూడా మే31 నుంచి పోస్ట్ పోన్ అయ్యింది. అంటే మే 31 న సోలోగా విశ్వక్ సేన్ రాబోతున్నాడు. గామి సక్సెస్ తర్వాత విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై మంచి అంచనాలున్నాయి.
మరి మిగతా సినిమాలు తప్పుకోవడం విశ్వక్ సేన్ కి కలిసొచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాసం కూడా ఉంది. అసలే వేసవి తాపంతో సరైన సినిమాలేక అల్లాడుతున్న ప్రేక్షకుడికి విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆసక్తి కలిగించే సినిమాగా కనిపిస్తోంది. ఈ సోలో డేట్ ని విశ్వక్ ఎలా క్యాష్ చేసుకుంటాడో చూద్దాం.