Advertisement

పిన్నెల్లి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి..?

Thu 23rd May 2024 10:47 PM
pinnelli  పిన్నెల్లి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి..?
Big relief for Pinnelli.. పిన్నెల్లి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి..?
Advertisement

పిన్నెల్లికి బిగ్ రిలీఫ్.. భవిష్యత్తు ఏంటి..?

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ప్రమాదంలో పడినట్టేనా..? ఇక రాజకీయాలకు దూరం కావాల్సిన సమయం ఆసన్నమైనట్టేనా..? ఆవేశానికి పోయి అడ్డంగా బుక్కయ్యి.. అనవసరంగా భవిష్యత్తు పాడు చేసుకున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఎన్నికల సంఘం ఏం చెబుతోంది..? రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం వచ్చేయండి.

అయ్యో పిన్నెల్లి..!

తప్పు చేస్తున్నా అని పిన్నెల్లికి బాగా తెలుసు.. దీని నుంచి ఎలా బయటపడాలో కూడా అంతకు మించి తెలుసు. ఎందుకంటే ఇది కేవలం ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన మాత్రమే.. ఇంతకు మించి దేశంలో చాలానే జరిగాయి. వారంతా ఎంచక్కా రాజకీయాల్లోనే ఉంటూ.. పదవులు అనుభవిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, 

కేంద్రమంత్రి అమిత్ షా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు పదవుల్లో ఉన్నారు. దీనితో పోలిస్తే ఈవీఎం ఘటన చిన్నపాటిదే అని బహుశా పిన్నెల్లి అనుకొని ఉండొచ్చు. అందుకే ఇంతలా హడావుడి చేసి ఉంటారేమో.. తప్పు చేశానని తెలిసి పోలీసులకు దొరకకుండా సినిమా చూపిస్తున్న పరిస్థితి.

మార్ఫింగ్ చేశారా..?

వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసింది నిజమేనని.. అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది..? అంతకు ముందు ఏం జరిగింది..? అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి అన్నది వైసీపీ వాదన. సీన్ కట్ చేస్తే.. ఆ వీడియో ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయలేదని అనే సరికి ఒక్కసారిగా టోన్ మార్చింది వైసీపీ. ఈ వీడియో టీడీపీ యువనేత నారా లోకేష్ ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది మార్ఫింగ్ చేయలేదని ఎలా నమ్మాలి..? తప్పకుండా తేడా జరిగిందని చెబుతున్న పరిస్థితి. దీనికి తోడు తనను అరెస్ట్ చేయవద్దని నేరుగా హైకోర్టును ఆశ్రయించడం భారీ ఊరట లభించింది.

జూన్‌ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్‌ 6కు వాయిదా వేయడం జరిగింది.

రుజువు ఐతే ఏమవుతుంది..?

ఈవీఎంను ధ్వంసం చేస్తూ ఎమ్మెల్యే నేరుగా పట్టుబడిన సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. అందుకే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని పోలీసులు వేట సాగిస్తున్నారు. పక్కా ఆధారాలు లభించడంతో శిక్ష పడటం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రెండేళ్లు జైలు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి.. ఆరేళ్లపాటు ఐతే అనర్హులవుతారని చట్ట నిబంధనలు చెబుతున్నాయనీ నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. అప్పుడిక తన తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామి రెడ్డిని నేరుగా అరంగేట్రం చేయించాల్సి ఉంటుంది.

Big relief for Pinnelli..:

Big relief for Pinnelli.. What is the political future..?

Tags:   PINNELLI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement