బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 100 మందికి పైగా సెలబ్రిటీస్ పోలీసులకి పట్టుబడ్డారు. అందులో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నటుడు శ్రీకాంత్, నటి హేమ, యాంకర్ శ్యామల, జానీ మాస్టర్ పేర్లు మీడియాలో హైలెట్ అవగా.. శ్రీకాంత్ వెంటనే తాను ఎలాంటి పార్టీల్లో పాల్గొనలేదు, తాను హైదరాబాద్ లోనే ఉన్నాను, నాకు ఈ రేవ్ పార్టీకి సంబంధం లేదు అంటూ హైదరాబాద్ లోని తన ఇంట్లో నుంచి వీడియో చేసి మీడియాకి పంపించాడు.
ఆ తర్వాత మీడియా ఎడిటర్ శ్రీకాంత్ పేరు వాడినందుకు క్షమాపణ కూడా చెప్పాడు. తాజాగా శ్రీకాంత్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
నాకు డ్రగ్స్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు
నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను
నాపైన దుష్ప్రచారం చేస్తేే ఊరుకోను
నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్ కి వెళ్ళాను
నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే మీడియా హౌసెస్ కి నోటీస్ ఇస్తాను
నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్లకి కూడా నేను నోటీసులు ఇస్తాను
శ్రీకాంత్ అంటేనే ఫ్యామిలీ మాన్ నాపైన ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు
కోర్టులో చూసుకుంటాను లీగల్ గా వెళ్తాను
నిజంగా నేను ఉంటే నాపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధం
నిజంగా పార్టీలో ఎవరు ఉన్నారో తెలుసుకుని వాళ్ళని వదిలి పెట్టకండి.. అంటూ మాట్లాడాడు.