ఇప్పటికి ఉప్పెన బ్యూటిగానే పిలిపించుకుంటున్న కృతి శెట్టి ప్రస్తుతం మనమే చిత్రం విడుదల కోసం వెయిట్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత హీరో శర్వానంద్ జోడిగా కృతి శెట్టి మనమే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రం సక్సెస్ అయితే తిరిగి మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతాననే నమ్మకంతో కనిపిస్తుంది.
ఇక కోలీవుడ్, మలయాళ ఇండస్ట్రీస్ లో బిజీగా కనబడుతున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వయ్యారాలు పోతుంది. చక్కటి అందమైన ఫోటోషూట్స్ ని షేర్ చేస్తూ యూత్ ని మత్తెక్కిస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా కృతి శెట్టి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో కృతి చాలా అందంగా కనిపిస్తూ మతిపోగొడుతోంది.
మెరూన్ కలర్ లెహంగాకి స్లీవ్ లెస్ బ్లౌజు సెట్ చేసింది. బ్రైట్ గా కనిపించడానికి వైట్ చోకర్ వేసుకుంది. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని కృతి శెట్టి నిజంగానే మతిపోగొట్టింది అంటే నమ్మాల్సిందే. కృతి శెట్టి ఇలా ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు.. వేలల్లో కామెంట్లు వచ్చాయి.