బెంగుళూరు రేవ్ పార్టీలో నేను లేను, నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఛిల్ అవుతున్నా అంటూ హడావిడిగా వీడియో విడుదల చేసినప్పుడే నటి హేమ అడ్డంగా దొరికేసింది. తాను పట్టుబట్ట ఫామ్ హౌస్ నుంచే ఆమె వీడియో చేసింది అంటూ బెంగుళూరు పోలీసులు నిర్ధారించడమే కాదు.. హేమ పై సీరియస్ కూడా అయ్యారు.
అయినప్పటికి హేమ తాను ఆ పార్టీలో లేను, నేను ఇక్కడే ఉన్నాను అంటూ వీడియోస్ మీద వీడియోస్ వదిలింది. అయితే బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికిన హేమ బ్లడ్ శాంపిల్స్ పోలీసులు సేకరించి ఆమెని వదిలెయ్యగా.. హేమ హైదరాబాద్ వచ్చేసింది. ఆతర్వాత కూడా తనని ఇలా ఇరికించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో వారిని కనిపెడతాను, వారి అంతు తెలుస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.
తాజాగా బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారి శాంపిల్స్ రిపోర్ట్స్ షాకిస్తున్నాయి. ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీమ్ సేకరించగా.. ఇందులో 57 మంది అబ్బాయిలు, 27 మంది అమ్మాయిల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 86 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
ఆ 27 మంది అమ్మాయిల్లో నటి హేమ కూడా ఉంది అని సమాచారం. హేమ కూడా డ్రగ్స్ తీసుకుని అని అధికారులు తేల్చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికి బబుకాయిస్తూనే ఉన్న హేమ ఇప్పుడు ఎలా కవర్ చేసుకుంటుదో అంటూ నెటిజెన్స్ హేమ సుప్పిని సుద్దపూసని డ్రామాపై కామెంట్స్ చేస్తున్నారు.