Advertisementt

జాన్వీ కపూర్ కి ఆ పిచ్చి ఎక్కువట

Thu 23rd May 2024 11:25 AM
janhvi kapoor  జాన్వీ కపూర్ కి ఆ పిచ్చి ఎక్కువట
Janhvi Kapoor is crazy about that జాన్వీ కపూర్ కి ఆ పిచ్చి ఎక్కువట
Advertisement
Ads by CJ

జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ గ్లోబల్ స్టార్ తో నటిస్తూ క్రేజీ క్రేజీగా మారిపోయింది. నిన్నమొన్నటివరకు సౌత్ ని లైట్ తీసుకున్న జాన్వీ కపూర్.. బాలీవుడ్ షాక్ ల మీద షాక్ లు తగలడంతో అమ్మడు సౌత్ పైకి వచ్చి పడింది. జాన్వీ సౌత్ కి సై అనడమే తరువాయి.. ఎన్టీఆర్-రామ్ చరణ్ ఇద్దరూ తమ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసేసుకున్నారు. 

దేవర చిత్రంతో అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిస్సెస్ మహి చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా కనిపిస్తుంది. ఆ ప్రమోషన్స్ లోనే సౌత్ హీరోలు, సినిమాల గురించి మాత్రమే కాదు.. పర్సనల్ విషయాలని కూడా షేర్ చేస్తుంది. అందులో భాగంగా జాన్వీ చెప్పిన ఓ ముచ్చట సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. 

అది జాన్వీ కపూర్ కి జ్యోతిష్కం అంటే పిచ్చట. ఆమె జ్యోతిష్కాన్ని ఎక్కువగా నమ్ముతుందట. రాశులు చెక్ చేసుకునే ఏ పనైనా చేస్తుందట. మనమంతా రాశులు చెక్ చేసుకుంటాము, నేను అంతే. ఇప్పటికి రాశి సరిగ్గా ఉందా అని చూసుకుంటూ ఉంటాను. ఒకవేళ రాసి సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తితో మాట్లాడడం కూడా మానేస్తాను అంటూ జాన్వీ కపూర్ తనకి జ్యోతిష్కం పై నున్న నమ్మకాన్ని చెప్పుకొచ్చింది. 

అయితే జ్యోతిష్కం పై నమ్మకం ఉండొచ్చు కానీ.. మరీ అంత నమ్మకం ఉండకూడదేమో జాన్వీ అంటూ ఆమె అభిమానులు ఆమెకి సలహాలు ఇస్తున్నారు. 

Janhvi Kapoor is crazy about that:

Janhvi Kapoor Says She Believes In Astrology

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ