టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఘోర పరాజయం పాలవుతారు..! ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట.. ఇక సోషల్ మీడియాలో ఐతే బాబోయ్ చూడలేం.!
బెట్టింగ్స్ ఐతే వేల కోట్లల్లో నడుస్తున్నాయ్..!
ఇవన్నీ ఒక ఎత్తయితే వైసీపీ నేతల ప్రకటనలు చేసిన ప్రతీసారి టీడీపీ శ్రేణుల్లో వణుకు పుడుతోంది. ఇంత ధీమాగా వైసీపీ ఎలా చెబుతోంది..? అసలు టీడీపీ అందులోనూ బాబు కంచుకోటలో ఇది సాధ్యమేనా..? అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్న పరిస్థితి. పైగా ఇన్నేసి ఆరోపణలు, మీడియా సమావేశాలు వైసీపీ ఊదర గొడుతుంటే పైకి ఒక్కరంటే ఒక్కరూ అబ్బే అస్సలు కాదు.. కనీసం ఇంత మెజారిటీ వస్తుంది అని డిఫెండ్ చేసుకోలేక చేతులు ఎత్తేశారు తమ్ముళ్లు. ఈ విషయంలో చంద్రబాబు ఏమీ తక్కువ కాదు.. పోనీ విదేశాల్లో ఉన్నారు అనుకుందాం ఒక ట్వీట్ లేదా ఒక వీడియో రిలీజ్ చేయడానికి ఏంటి..? అనేది ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
కూటమి అధికారంలోకి వస్తే..?
పోనీ కూటమి మంచి మెజారిటీ స్థానాలతో గెలిచి.. వైసీపీ చెబుతున్నట్లు నిజంగా చంద్రబాబు ఓడితే పరిస్థితి ఏంటి..? అని అటు జనసేన ఇటు బీజేపీ పెద్దలు ఢిల్లీ వేదికగా చర్చిస్తున్నారట. ఐతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని ఆ పార్టీ శ్రేణులు, వీరాభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక బీజేపీకి అంటారా.. అంత సీన్ లేదు.. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా అక్షరాలా నిజం. పోనీ టీడీపీ నుంచే చంద్రబాబు తర్వాత నంబర్ 2గా ఉన్న యువనేత నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉందా అంటే అబ్బే ఆ ఛాన్సే లేదట. ఇక మిగిలింది ఎవరు..? అటు తిరిగి ఇటు తిరిగి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే..!
ఓడితే సీఎం అవ్వొచ్చా..?
అవును.. కూటమి గెలిచి.. చంద్రబాబు ఓడినా ముఖ్యమంత్రి కావొచ్చు. ఎలాగంటే.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల లోపు ఎమ్మెల్సీ లేదా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి అనగా పార్టీ తరఫున గెలిచిన వారిని రాజీనామా చేపించి అక్కడినుంచి గెలిచి తీరాలి.. అలా కాని పక్షంలో చంద్రబాబు సీఎంగా ఉండే అవకాశం అస్సలు ఉండదు. ఐనా ఇలాంటి తెలియని రాజకీయ నేత కాదు కదా బాబు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, దేశానికి ఎంతో మందిని ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చెప్పుకునే బాబుకు నిజంగా ఇలాంటి అదేనబ్బా కుప్పంలో ఓడిపోవడం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహల్లోకి వెళ్లండి చూద్దాం. చూశారుగా.. ఇదీ సంగతి వైసీపీ ధీమా నెగ్గుతుందో.. టీడీపీ సైలెంట్ వార్ వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి మరి.