Advertisementt

హాస్పిటల్ లో చేరిన షారుఖ్

Wed 22nd May 2024 08:51 PM
shah rukh khan  హాస్పిటల్ లో చేరిన షారుఖ్
Bollywood Badshah admitted in Hospital హాస్పిటల్ లో చేరిన షారుఖ్
Advertisement
Ads by CJ

గత మంగళవారం రాత్రి కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హడావిడి చేస్తూ మైదానంలో అభిమానులకి అభివాదం చేసిన కింగ్ ఖాన్ షారుక్ ఇప్పుడు సడన్ గా ఆసుపత్రిలో చేరడం ఆయన అభిమానులలో అందోళనకు గురి చేసింది. షారుఖ్ ఖాన్ కి తీవ్ర వడదెబ్బ తగలడంతో అస్వస్థతకి గురై ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. 

అహ్మదాబాద్‍లో సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో షారుఖ్ క్రికెట్ మ్యాచ్ హడావిడిలో డీహైడ్రేషన్‍కు గురయ్యారు. ఆయనకి వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కుటుంబ సభ్యులు షారుఖ్ ని ఆసుపత్రికి తరలించగా.. షారుఖ్ కి వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చి పర్యవేక్షణలో ఉంచినట్లుగా తెలుస్తోంది. 

షారుఖ్‍తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్, ఫ్రెండ్ జూహి చావ్లా కూడా ఆసుపత్రికి వచ్చారని, ప్రస్తుతం షారుఖ్ పూర్తిగా కోలుకోవడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేశారని సమాచారం.. షారుఖ్ ఆసుపత్రిలో చేరిన వెంటనే ఆసుపత్రి చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ఇక షారుఖ్ సేఫ్ గా ఉన్నారని తెలిసి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు

Bollywood Badshah admitted in Hospital:

Shah Rukh Khan shifted to hospital due to dehydration

Tags:   SHAH RUKH KHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ