Advertisementt

మహేష్ కలలోనైనా ఊహించాడా?

Wed 22nd May 2024 07:22 PM
mahesh babu  మహేష్ కలలోనైనా ఊహించాడా?
Mahesh Babu Mission SSMB29 In Full Swing మహేష్ కలలోనైనా ఊహించాడా?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ఫిట్ నెస్ కోసం రోజు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చమటలు చిందిస్తూ 40 ప్లస్ లోను హ్యాండ్ సమ్  గా కనిపించడానికి చాలా కష్టపడతాడు. మహేష్ ని ఎప్పుడు బయట చూసినా అభిమానులతో పాటు అమ్మాయిలు కూడా సర్ ప్రైజ్ అవుతూనే ఉంటారు. అయితే సినిమాల్లోనే కాదు, హెల్త్ విషయంలోనూ చాలా కేర్ ని తీసుకునే మహేష్ ఇప్పుడు పడే కష్టాన్ని కలలోనైనా ఊహించి ఉండడేమో అంటున్నారు. 

అదే రాజమౌళి తో కలిసి చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం కోసం మహేష్ తన మేకోవర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. జిమ్ లో వర్కౌట్స్, లుక్ విషయంలో జాగ్రత్తలు ఇవన్నీ మహేష్ ని బాగా కష్టపడేలా చేస్తున్నాయి. మహేష్ ఇప్పటివరకు చేసిన పాత్రలు ఒక ఎత్తు, ఇప్పుడు రాజమౌళి చిత్రం కోసం చెయ్యబోయే పాత్ర మరో ఎత్తు అన్నట్టుగా ఉంది వ్యవహారం. 

రాజమౌళి తో మొదలు పెట్టబోయే చిత్రంలో లుక్ కోసం కఠినమైన శారీరక శిక్షణలో ఉన్న మహేష్ కు ఇది నిజంగా చాలెంజ్ అనే చెప్పాలి. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ చిత్రంలో తన బాడీ ని కూడా  పవర్ఫుల్ గా తయారు చేసేందుకు మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. 

అటు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉంటే.. ఇటు మహేష్ బాబు జిమ్ లో చమటలు చిందిస్తున్నాడు. అందుకే మహేష్ ఇలాంటి కష్టాన్ని కలలో కూడా ఊహించి ఉండడు.. అంటూ ఆయన అభిమానులే కామెంట్ చేస్తున్నారు. రాజమౌళి-మహేష్ కాంబో అంటే ఇంకా చాలామంది సర్ ప్రైజ్ అవుతూనే ఉన్నారు. 

Mahesh Babu Mission SSMB29 In Full Swing:

Mahesh Babu has fans buzzing with his recent dramatic makeover

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ