కొన్నేళ్లుగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ ఈ ఏడాది ఖచ్చితంగా వినబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేమిటో ఈపాటికే అభిమానులు గెస్ చేసే ఉంటారు. అదే.. నందమూరి నట సింహ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. బాలయ్య బాబు తన సినిమాలు, రాజకీయాలేనా కొడుకు సినీ ఎంట్రీ పై డెసిషన్ తీసుకోరా అని అభిమానులు ఆలోచించేస్తున్నారు.
అటు మోక్షజ్ఞ హీరో మెటీరియల్ లోకి మారిపోయి చాలారోజులవుతుంది, ఆ విషయం అభిమానులని ఆనందపరుస్తున్నా.. ఆయన సినీ రంగ ఎంట్రీ పై మాత్రం వారు వెయిట్ చేస్తూ చేస్తూ ఆందోళనలోకి వెళ్లిపోతున్నారు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందో అని అభిమానులు ఎదురు చూడని రోజులేదు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ పై ఈ ఏడాది గుడ్ న్యూస్ వినిపించడం పక్కా అని తెలుస్తోంది.
వీలైనంత త్వరగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై నిర్ణయం తీసుకోవాలని బాలయ్య అనుకుంటున్నారట. ప్రస్తుతం దానికి సంబంధించి పనులు వేగంగా మొదలయ్యాయనే న్యూస్ చూసి నందమూరి అభిమానులు హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయేలా చేసింది. మరి ఆ గుడ్ న్యూస్ ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వినిపిస్తే వారు కూల్ అవుతారు.