బేబీ చిత్రంతో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య ఇద్దరూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా వైష్ణవి చైతన్య అయితే ఊహించని సక్సెస్ ఎంజాయ్ చేసింది. ఈ చిత్రంతో దర్శకనిర్మాతలకు బాగా పేరొచ్చింది. మరి ఈచిత్రం తర్వాత హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్న చిత్రాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి మొదలైంది.
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ గం గం గణేశా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవగా.. వైష్ణవి చైతన్య బిగ్ బ్యానర్ దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ తో కలిసి లవ్ మీ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చెందుకు రెడీ అయ్యింది. లవ్ మీ ఈవెంట్స్ లో వైష్ణవి చైతన్య చాలా స్పెషల్ గా కనబడుతుంది.
మరి బేబీ చిత్రంలో ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్యలు పెరఫార్మెన్స్ పరంగా విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు. ఇప్పుడు వారి తదుపరి చిత్రాల్లో వారి లక్ ఎలా ఉందొ అని వాళ్ళ అభిమానులతో పాటుగా కామన్ ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ఈ బేబీ హీరో-హీరోయిన్ ఫేట్ ఎలా ఉందో అనేది.