బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం సౌత్ హీరోగా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తుంది. గతంలో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, మహేష్ తో భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఇప్పుడు చరణ్ తో గేమ్ చేంజర్ లోను, ఎన్టీఆర్ తో వార్ 2 లో నటిస్తూ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా మారబోతుంది.
బాలీవుడ్ లోను సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీకి సౌత్ లో టాలీవుడ్ తప్ప మిగతా లాంగ్వేజెస్ నుంచి అంతగా అవకాశాలు రావడం లేదు. లైక్ సూర్య, అజిత్, విజయ్ ఇలా కోలీవుడ్ స్టార్ హీరోలెవరూ కియారా అద్వానీని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కియారా అద్వానీ కోలీవుడ్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది.
కోలీవుడ్ హీరో శింబు సరసన కియారకి చోటు దక్కింది అంటున్నారు. కొన్నేళ్లుగా సక్సెస్ లేని శింబు ఈమధ్యన సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు. తాజాగా శింబు కమల్ హాసన్ థగ్ లైఫ్ లో కీ రోల్ పోషిస్తున్నాడు. అంతేకాకుండా పెరియస్వామి దర్శకత్వంలో శింబు డ్యూయెల్ రోల్ తో ఓ మూవీ చెయ్యబోతున్నాడు. ఈ చిత్రంలోనే శింబుకి జోడిగా కియారా ని అనుకుంటున్నారట మేకర్స్. మరి ఈ అవకాశం వస్తే కియారా అద్వానీ కోలీవుడ్ ఎంట్రీ ఖాయమైనట్లే.