తెలంగాణలో 5వేల కోట్ల లిక్కర్ స్కాం!
అవును.. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొన్ని పేరుగాంచిన బీర్లు అస్సలు కనిపించట్లేదు. అదేంటి అని వైన్స్ వాళ్ళను అడిగితే షార్టేజ్ అంటున్నారు. ఇందులో నిజమెంత..? అసలే ఎండా కాలం ఒక బీరు వేద్దామని అనుకుంటే సగటు లిక్కర్ లవర్లకు కోరుకున్నవి దొరకట్లేదు. దీంతో దేశంలో నీతి నిజాయితీగా టాక్స్ కడుతున్న తమకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని మందు బాబు నిలదేస్తున్నదంటే నిజంగానే తెలంగాణలో మందుకు ఎంత కరువు వచ్చిందో..!!
అసలేం జరుగుతోంది!!
గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర ఉందన్నది కొందరి నుంచి వస్తున్న అతి పెద్ద ఆరోపణ. అంతే కాదు RR అంటే రేవంత్ రెడ్డి టాక్స్ పేరిట ఫేమస్ లిక్కర్ బ్రాండ్లకు కమీషన్లు ఇవ్వాలని ఒత్తిళ్ళు వెళ్ళయని దీంతో మావల్ల కాదు బాబోయ్ అంత ఇచ్చుకోలేం అని సదరు బీర్ల కంపెనీ యాజమాన్యాలు చేతులు ఎత్తేసినట్టు తెలిసింది. అడిగిన మొత్తంలో కమీషన్లు ఇవ్వట్లేదని ఫేమస్ కంపెనీల బీర్లు ఆర్డర్లు పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించి గేమ్ ప్లాన్ ఆడుతున్నారని ప్రతిపక్షాలు, మందు బాబులు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ మొత్తం వ్యవహారం వెనుక రూ. 5000 కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని తెలియవచ్చింది. అంటే ఇంచుమించు దేశంలో పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుతో సమానంగా నడిచిందనేది కొందరి వాదన.
వాట్ నెక్స్ట్..?
ఐతే వైసీపీ హయాంలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్.. ఇలా చిత్ర విచిత్రాలుగా పేర్లు ఉన్న బ్రాండ్స్ దర్శనమిచ్చాయి. ఆఖరికి ఈ మందు తాగలేక ప్రభుత్వాన్ని సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీల వరకూ సోషల్ మీడియా వేదికగా పచ్చి బూతులు తిట్టిన సందర్భాలు కోకొల్లలు. ఐతే ఇప్పుడు తెలంగాణలో కూడా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ తరహా బ్రాండ్లు కనిపించనున్నాయ్ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఐతే.. కమీషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరుచుకుంటాయని టాక్ నడుస్తోంది. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగు కానున్నట్లు సమాచారం. మొత్తం 5 వేల కోట్ల రూపాయల స్కాం అని దీని వెనుక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రి తమ్ముడు చక్రం తిప్పుతున్నట్లు తెలియవచ్చింది.
అయ్యే పనేనా..?
వాస్తవానికి తెలంగాణలో RR ట్యాక్స్ ఎక్కువ అయ్యిందని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షానే చెప్పారు. ఇప్పుడు ఇక ఈ బీర్ల వ్యవహారంలో మరోసారి తెర మీదకు వచ్చింది. మరోవైపు.. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కృత్రిమ కొరత ఉన్నది. ఇది సాకుగా చూపుతూ కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు.. వాటి ద్వారా భారీగా కమీషన్ పొందేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.