కల్కి 2898 AD చిత్ర ప్రమోషన్స్ ఈరోజు హైదరాబాద్ వేదికగా మొదలు కాబోతున్నాయి. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కల్కి కార్ మోడల్ రివీల్ ఈవెంట్ ని మేకర్స్ కనివిని రీతిలో నిర్వహిస్తున్నారు ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున హాజరు కాబోతున్న ఈ ఈవెంట్ లో ఎన్నో వింతలూ విశేషాలు ఉండబోతున్నాయట.
ఈ ఈవెంట్ కోసం ఏడు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎగిరే కారుని తయారు చెయ్యడమే కాదు, రెండు కోట్లకు పైగా ఖర్చుతో తయారు చేసిన బుల్లెట్లు పేల్చే జాకెట్ తో హీరో అదేనండి ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడని, తన బుజ్జిని రివీల్ చేస్తాడని టాక్. ఇవే కాదు.. కల్కి కార్ మోడల్ రివీల్ ఈవెంట్ లో మరెన్నో వింతలూ విశేషాలు ఉంటాయంటూ మాట్లాడుకుంటున్నారు.
మరి ఇలాంటివన్నీ ఇప్పటివరకు దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల ప్రమోషన్స్ కోసం ప్లాన్ చేసేవారు. ఇప్ప్పుడు మరో రాజమౌళిలా కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ కనిపిస్తున్నారనే మాట ఇలాంటి వార్తలు చూసినప్పుడల్లా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ల కోసం ముంబై లో రాజమౌళి ఇలాంటి ఏర్పాట్లే చేశారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం ఇలా యునిక్ ఏర్పాట్లు చెయ్యడమే హాట్ టాపిక్ అయ్యింది.