Advertisementt

అనుపమని ఫాలో అయిపో రీతూ

Tue 21st May 2024 01:10 PM
ritu varma  అనుపమని ఫాలో అయిపో రీతూ
Ritu Varma Steals Hearts With Her Latest Look అనుపమని ఫాలో అయిపో రీతూ
Advertisement
Ads by CJ

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ అందంగా, క్యూట్ గా ఉంటుంది. కానీ గ్లామర్ కి దూరంగా ఉండడంతో రీతూ వర్మకి స్టార్ ఛాన్సెస్ రావడం లేదు. అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తున్నా అది సరిపోదు అనే సలహాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తరుచు కాకపోయినా.. సందర్భాన్ని బట్టి యాక్టీవ్ గా ఉండే రీతూ వర్మ తాజా లుక్ చూస్తే అందరూ షాకవ్వాల్సిందే. 

బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో రీతూ వర్మ డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో తన లుక్ ను కంప్లీట్ గా మార్చేసింది. షార్ట్ హెయిర్ తో.. అందాలని చూపించి చూపించనట్టుగా అదరగొట్టేసింది. ఎంతగా రీతూ వర్మ గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అనే సంకేతాలు పంపుతున్నా రీతూ వర్మకి అవకాశాలు ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాయి. 

అందుకే ఆమె అభిమానులు కూడా రీతూ నువ్ కూడా అనుపమని ఫాలో అయిపో, ఆమెలా ట్రై చేయకూడదా అనే సలహాలు ఇస్తున్నారు. ట్రెడిషనల్ గర్ల్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు తన స్టయిల్ మొత్తం చేంజ్ చెయ్యడమే కాదు బోల్డ్ కేరెక్టర్స్ లో చెలరేగిపోతుంది. దాని రిజల్ట్ అమ్మడు చేతి నిండా అవకాశాలే. అందుకే రీతూ వర్మ కూడా అనుపమలా ట్రై చేస్తే ఏమన్నా ఫేట్ మరుద్దేమో అని అభిమానుల ఆశ. 

Ritu Varma Steals Hearts With Her Latest Look:

Ritu Varma Steals Hearts With Her Latest Stills

Tags:   RITU VARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ