సలార్ 2 షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతున్నట్టుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి నటులు పృథ్వీ రాజ్ సుకుమారన్, బాబీ సింహాలు చెబుతూ వస్తున్నారు. సలార్ పార్ట్ 1 షూటింగ్ సమయం లోనే సలార్ పార్ట్ 2 షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసెయ్యడంతో.. పార్ట్ 2 కి సంబంధించి తక్కువ షూటింగ్ చిత్రీకరణ మిగిలి ఉంది. ఇక జూన్ మొదటి వారం నుంచి సలార్ 2 షూటింగ్ మొదలు పెడతారని టాక్ ఉంది.
అయితే ఆగష్టు నుంచి దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో NTR 31 చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నట్టుగా మైత్రి వారు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్‌ను ఆగస్ట్ 2024 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మరి ఆగష్టు అంటే ఏంతో సమయం లేదు.
ఈలోపులో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ 2 షూటింగ్ పూర్తి చేస్తారా.. ఇంత తక్కువ సమయంలో సలార్ పార్ట్ 2 షూటింగ్ ఫినిష్ అవుతుందా.. అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సలార్ పార్ట్ 2 ప్రభాస్ డేట్ ఇస్తే త్వరగానే ఫినిష్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పక్కనబెట్టి ముందుగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ మొదలు పెట్టేసి.. కొంత పార్ట్ చిత్రీకరణ అవ్వగానే సలార్ పోస్ట్ ప్రొడక్షన్ లోకి దిగుతారు. డిసెంబర్ లో సలార్ పార్ట్ 2 రిలీజ్ ఉండొచ్చు, లేదు అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి సలార్ 2 విడుదల అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.