నారా-నందమూరి కుటుంబాలు ఎంతో సఖ్యంగా ఉన్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి-నారా ఫామిలీస్ ఎందుకో డిస్టెన్స్ ని మైంటైన్ చేస్తాయి. కావలసినప్పుడు ఎన్టీఆర్ ని దగ్గరకి తీసుకోవడం, తర్వాత దూరంగా పెట్టడం చేస్తాయి ఈ రెండు కుటుంబాలు అంటూ వుంటారు. కొన్ని కొన్నిసార్లు అది నిజమే అనిపిస్తుంది అందరికి.
ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోకి వస్తే నారా లోకేష్ కి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని టీడీపీ లో ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నారని చాలామంది ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు అంటూ ఉంటారు. అయితే నారా లోకేష్-ఎన్టీఆర్ ల మధ్యన ఎంత బాండింగ్ ఉందొ తెలియదు కానీ.. ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా లోకేష్ ఎన్టీఆర్ ని విష్ చేసాడు.
Heartfelt birthday wishes to @tarak9999. May God bless you with good health and happiness అంటూ లోకేష్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు. దానికి ఎన్టీఆర్ రెస్పాండ్ అవుతూ స్పెషల్ గా Thank you so much for your wishes Lokesh అంటూ థాంక్స్ చెప్పడం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.