Advertisementt

ఈసారైనా కరుణిస్తావా బాలయ్యా..

Mon 20th May 2024 05:14 PM
nandamuri balakrishna  ఈసారైనా కరుణిస్తావా బాలయ్యా..
Big announcement of NBK on June 10th? ఈసారైనా కరుణిస్తావా బాలయ్యా..
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ రాజకీయంగా హిందూపూర్ నియోజకవర్గంలో ఎమ్యెల్యేగా పోటీ చేసారు. రెండు నెలలుగా బాలయ్య సినిమా షూటింగ్స్ కి బ్రేకిచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఏపీ మొత్తం ఎన్నికల వేడి ముగియడంతో బ్యాక్ టు షూటింగ్స్ అంటూ బాలకృష్ణ మళ్ళి NBK 109 సెట్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. జూన్ 10 న బాలయ్య బర్త్ డే.

NBK 109 నుంచి ఏదో ఒక బిగ్ ట్రీట్ అయితే నందమూరి అభిమానులకి ఖచ్చితంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. అయితే నందమూరి అభినులు ఎదురు చూసే గుడ్ న్యూస్ బాలయ్య ఈసారైనా వినిపిస్తారా.. అభిమానులని ఈ గుడ్ న్యూస్ తో కరుణిస్తారా అనే విషయంలో అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే గుడ్ న్యూస్ ఏమిటో ఈపాటికే చాలామందికి తట్టి ఉంటుంది. అదే నందమూరి వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం మూవీ గురించి బాలయ్య తన బర్త్ డే రోజున అనౌన్స్ చేస్తారా.. లేదంటే మరో ముహూర్తం పెడతారా.. అసలు మోక్షజ్ఞ ని హీరోగా ఎప్పుడు తీసుకొస్తారు అంటూ నందమూరి అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. అందుకే బాలయ్య ఈసారైనా కరుణిస్తావా అనేది.!

Big announcement of NBK on June 10th?:

Nandamuri Balakrishna is celebrating his birthday on June 10th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ