బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో పలువురు రాజకీయనాయకులతో పాటుగా, సినీ సెలెబ్రటీస్ పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో మందు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డి ఫామ్‌హౌస్ గా పోలీసుల విచారణలో తేలింది అని.. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యం కాగా.. ఈ రేవ్ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా పాల్గొన్నట్లుగా బెంగుళూరు పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా ఈ రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం దొరకడంతో.. వైసీపీ కి చెందిన కాకాణి కి ఈ రేవ్ పార్టీకి ఉన్న సంబంధం ఏమిటో అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేసిన సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు.