ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. అందుకే ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం దేవర నుంచి టైటిల్ సాంగ్ ఒకటి వదిలారు. అనిరుద్ రవి చంద్రన్ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి వస్తున్నా దేవర సాంగ్ పై అందరిలో విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఎన్టీఆర్ బర్త్ డే కి ఒక రోజు ముందే మే 19 సాయంత్రమే దేవర ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ ని వదిలారు మేకర్స్.
మరి ఆ పాట చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చినా.. మిగతా మ్యూజిక్ లవర్స్, నెటిజెన్స్ మాత్రం రకరకాలుగా దేవర ఫియర్ సాంగ్ పై స్పందిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ బర్త్ డే సాంగ్ లో అనిరుద్ ఎలివేషన్ ఏమిట్రా అంటూ చాలామంది స్పందించగా.. కొంతమంది కమల్ విక్రమ్ టైటిల్ ట్రాక్ ని తీసుకోచ్చి దేవరకి పెట్టారేమిట్రా అంటున్నారు.
ఒక్క ముక్క సాంగ్ లో అర్ధమైతే ఒట్టు, ఆ మ్యూజిక్ మధ్యలో ఏం వినిపించలేదు లిరిక్స్, దేవర ముంగిట నువ్వెంత తప్ప మిగతా లిరిక్స్ అర్ధమై చావాలా అంటూ దేవర సాంగ్ పై నెటిజెన్స్ పలు రకాల రియాక్షన్స్ ఇస్తున్నారు.
దేవర సాంగ్ లిరిక్స్
అగ్గంటుకుంది సంద్రం
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
చల్లారె చెడు సాహసం
జగడపు దారిలో
ముందడుగైన సేనాని
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే
కలుగుల్లో దూరెనే
జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా
అలలయ్యే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా
దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
భయమున దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయ్యే
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే