Advertisementt

పోతినకు ధీటుగా పోటేసిన మెగాభిమాని

Thu 06th Jun 2024 06:11 PM
chiranjeevi  పోతినకు ధీటుగా పోటేసిన మెగాభిమాని
Mega Fan Counter to Pothina Mahesh పోతినకు ధీటుగా పోటేసిన మెగాభిమాని
Advertisement
Ads by CJ

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పోలింగ్ ఘట్టం ముగిసింది.. రిజల్ట్స్ కోసం అంతా వేచి చూస్తున్నారు. జూన్ 4తో ఆ ఘట్టానికి కూడా తెరపడుతుంది. అయితే ఈ లోపు కొందరు కూయాల్సిన కూతలు, కోయాల్సిన కోతలు అన్నట్లుగా రాజకీయాన్ని వేడెక్కించే పనిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ.. బెజవాడకు చెందిన పోతిన మహేష్.. మరో కత్తి మహేష్‌ని తలపిస్తున్నాడు. అక్కడ విషయం ఏమీ లేకుండానే అప్పట్లో కత్తి మహేష్ ఎలా అయితే హడావుడి చేశాడో.. అంతకు మించి అనేలా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నాడు. 10 కోట్ల రూపాయలకు పార్టీ టికెట్‌ని అమ్ముకునే ప్రయత్నం చేసి.. జనసేన నుంచి బయటికి పోయిన పోతిన మహేష్.. వైసీపీ కండువా కప్పుకుని అందిన మొత్తానికి మైక్ అందుకున్నాడు. ఆ మొత్తానికి జవాబుదారీ కనుక చిత్తానికి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన చెత్తమాటలతో, కారుకూతలతో.. ఎంత బ్యాడ్ అవుతున్నాడో అతనికి తెలియదు కానీ.. ఎంత బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడో మాత్రం అతనికి తెలియాల్సి ఉంది.. తెలుసుకోవాల్సి ఉంది.. తెలియజెప్పాల్సి ఉంది.

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో ఉన్న పోతిన.. మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అంటూ ఓ.. నోరేసుకుని తెగ పడిపోతున్నాడు. చివరి నిమిషంలో సీటును బేరం పెట్టి.. అమ్మ పాలు తాగి రొమ్ముపై గుద్దే నీచపు పొలిటికల్ నాలెడ్జ్ ఇంకా అతనికి ఎంత ఉందో తెలియదు కానీ.. సినిమా పరంగా మాత్రం అతనికి తెలియాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పోతిన మహేష్.. కావాలని కెలుకుతున్నావ్ కదా.. ఇప్పుడన్నీ తవ్వుకుంటూ వద్దాం.. తేల్చుకుంటూ వద్దాం.. తెలుసుకుంటూ వద్దాం.

నాగబాబుని ఉద్దేశిస్తూ.. నీవు చేసిన ట్వీట్ ఒకసారి చూసుకో.. అల్లు ఫ్యామిలీ ఏదో అండగా ఉందన్నట్లుగా రాసుకొచ్చావ్ కదా.. అసలు చిరంజీవి వెనుక అల్లు ఫ్యామిలీ పడిందా? అల్లు ఫ్యామిలీ వెంట చిరు పడ్డాడా? కోరి కోరి చిరంజీవిని అల్లుడిగా చేసుకుంది ఎవరో.. నీకు తెలియదేమో.. మీ బాబుని అడుగు చెబుతాడు.. లేదంటే ఒకసారి రికార్డ్ వెనక్కి తీసి చూడు. చిరంజీవికి ఏదో అల్లు ఫ్యామిలీ సపోర్ట్ చేసిందని వాగే వారందరికీ ఒకటే ప్రశ్న. అల్లు రామలింగయ్య తన కొడుకు అల్లు అరవింద్‌ని యాక్టర్‌ని చేయాలని ఎంతగా తపించాడో తెలుసుగా. మరి ఏమైంది. మా ఊరిలో మహాశివుడు నుంచి చంటబ్బాయ్ వరకు నటన విషయంలో అల్లు అరవింద్‌ ఫెయిల్యూర్‌గా మిగిలితే..  అప్పుడు సపోర్ట్ ఇచ్చింది ఎవరో వెళ్లి అల్లు అరవింద్‌ని అడుగు చెబుతాడు. నటుడిగా సక్సెస్ కాలేకపోతున్న అల్లు అరవింద్‌తో గీతా ఆర్ట్స్ సంస్థని పెట్టించి.. ఆ బ్యానర్‌లో సినిమాలు చేస్తూ.. అల్లు అరవింద్‌ని నిర్మాతగా నిలబెట్టింది ఎవరో.. ఒకసారి చరిత్ర తిరగేసి చూస్తే సత్యం బోధపడుతుంది. మాటలు ఇష్టం వచ్చినట్లు అనడం కాదు.. మాట్లాడే మాటలో నిజాయితీ ఉండాలి, నిజం ఉండాలి. ఎవరు ఎవరికీ సపోర్ట్‌గా ఉన్నారో.. ఎవరు ఎవరిని నిలబెట్టారో.. ఇకనైనా మైకు ముందు తెలుసుకుని మాట్లాడు. 

పుష్ప అంటూ అల్లు అర్జున్ గురించి ఏదో చెబుతున్నావ్ కదా.. రామ్ చరణ్ కంటే ముందు అల్లు అర్జున్ ఎంట్రీని ప్లాన్ చేసింది ఎవరు? ఆ ముక్క నీకు తెలియదా. డాడీ సినిమాలో డ్యాన్సర్‌గా చూపించి.. ఆ తర్వాత దిగ్గజాలతో గంగోత్రి సినిమాను ప్లాన్ చేసింది ఎవరో.. అల్లు ఆర్మీ అని చంకలు గుద్దుకునే వారికి తెలియదేమో.. ఇండస్ట్రీలో దిల్ రాజు, ఏ ఎమ్ రత్నం అంటూ ఈ మధ్య సొల్లు కబుర్లు చెప్పావ్‌గా.. ఆ మాత్రం నీకు తెలియదా?. అందులో మామయ్యది మొగల్తూరు అనే పాట ఎందుకు పెట్టారో తెలుసుకో ఫస్ట్. ఆ సినిమా క్రెడిట్ మొత్తం 100వ సినిమా అంటూ రాఘవేంద్రరావుకి పోయి.. అల్లు అర్జున్‌కి రావాల్సిన గుర్తింపు రానప్పుడు.. దాదాపు 30 కథలు విని మరీ ఆర్య కథని ఓకే చేసింది ఎవరో.. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూడు. కాస్త పేరు రాగానే అదిప్పుడు మరిచిపోయారా? ఆర్య సినిమాను ఓకే చేసింది ఎవరు? క్లాప్ కొట్టిందెవరు? 125 డేస్ షీల్డ్ ఇచ్చిందెవరు? అంతా మెగాస్టార్ పెట్టిన భిక్ష. సపోర్ట్ అంటే అది. 

ఒకవేళ అల్లు అర్జున్‌కు రాజకీయాలను ప్రభావితం చేసేంత రేంజే ఉంటే.. తన తమ్ముడు అల్లు శిరీష్‌ని ఎందుకు హీరోగా నిలబెట్టుకోలేకపోతున్నాడు. వాడికి లైఫ్ ఇచ్చాడు, వీడికి లైఫ్ ఇచ్చాడు అని ఓ డబ్బా కొడుతున్నావ్ కదా.. సొంత తమ్ముడిని స్టార్‌ని చేయమని చెప్పలమ్మా డబ్బా. సరే.. ఆ సంగతి వదిలేద్దాం.. రీసెంట్‌గా అల్లు రామలింగయ్య 100వ బర్త్‌డే అంటూ వేడుకలను జరిపారు కదా.. ఆ ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్ ఎవరు? అందులో మెగా స్పీచ్ ఎవరిది? ఈ మధ్య అల్లు స్టూడియో అంటూ హడావుడి చేశారుగా.. ఆ స్టూడియోకు ఇనాగరేషన్ చేసింది ఎవరు? ఇవన్నీ మరిచిపోతే ఎలా? ఇవన్నీ అల్లు, మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కి గుర్తున్నాయి. 

చరణ్ మామ పాట పెట్టు అని అడిగే తన కొడుకు గురించి అల్లు అర్జునే చెప్పాడు. అల్లు అర్జున్ ఎదుగుదల పట్ల ఎప్పటికప్పుడు రామ్ చరణ్.. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటాడు. చిరంజీవి అందరినీ తన సొంత బిడ్డలుగానే చూస్తాడు. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరినీ సోదరుడిగానే భావిస్తాడు. మీలాంటి కుక్కలు ఎన్ని మొరిగినా.. ఎన్ని గాడిదలు ఒండ్రించినా.. ఎన్ని పిచ్చికాకులు కావ్ కావ్ మన్నా.. పిచ్చతనంగానే ఉంటుందిరా పిచ్చినాయనా.. 

-ఓ మెగాభిమాని

Mega Fan Counter to Pothina Mahesh:

Mega Fan Letter on Mega and Allu Issue

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ